Women New Scheme: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభం.. అవన్నీ ఉచితంగా పంపిణీ..

Women New Scheme: మహిళలకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వం మరో కొత్త పథకం ప్రారంభం.. అవన్నీ ఉచితంగా పంపిణీ..


ఏపీలోని మహిళల కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఉచిత బస్సు ప్రయాణంతో పాటు మహిళలకు వడ్డీ లేని బ్యాంక్ రుణాలు అందిస్తోంది. ఈ క్రమంలో మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చు. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సొంతగా వ్యాపారం మొదలుపెట్టవచ్చు. రూ.50 వేల విలువైన సమాగ్రిని కూడా ఉచితంగా అందించనునున్నారు. అలాగే వ్యాపారం ఎలా చేయాలనే దానిపై పాటు ఆదాయం ఎలా పొందాలనే విషయాలపై మహిళలకు ఉచితంగా ప్రభుత్వం ట్రైనింగ్ ఇవ్వనుంది. ఇందకోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ఎగ్ మార్ట్‌ల ఏర్పాటు

మహిళలకు ప్రభుత్వం ఎగ్ మార్ట్‌లు కేటాయించనుంది. వీటి ద్వారా గుడ్లను విక్రయించి మహిళలు ఆదాయం పొందవచ్చు. ఇందుకు కావాల్సిన కార్ట్, సామాగ్రి మొత్తం ప్రభుత్వమే అందించనుంది. మార్ట్ కోసం అవసరమయ్యే రూ.50 వేలు విలువ చేసే బండి, సామాగ్రి మొత్తం ఉచితంగా ఇవ్వనున్నారు. రాష్ట్రంలో రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు, ప్రధానమైన కూడళ్ల వద్ద ఈ ఎగ్ మార్ట్‌లను ఏర్పాటు చేస్తారు. దీని వల్ల మహిళలకు సేల్స్ పెరిగి అధిక ఆదాయం లభిస్తుంది. ఈ ప్రభుత్వ పథకంతో రూపాయి కూడా ఖర్చు చేయకుండా మహిళలు స్వయం ఉపాధి పొందవచ్చు. ఈ వ్యాపారం ఎలా చేయాలి..? అనే దానిపై మహిళలకు ఉచితంగా ట్రైనింగ్ కూడా కల్పిస్తారు. అనంతరం మహిళలను ఎంపిక చేసి ఎగ్ మార్ట్‌లు కేటాయిస్తారు. రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం నెక్ సంస్థతో మెప్మా ఒప్పందం కుదుర్చుకుంది.

దరఖాస్తు చేసుకోవడమెలా..?

ఆసక్తికర మహిళలు సమీపంలోని మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. అధికారులు పరిశీలించి లబ్దిదారులను ఎంపిక చేశారు. వారికి శిక్షణ అందించి ఎగ్ మార్ట్‌లను కేటాయిస్తారు. డ్వాక్రా గ్రూపుల్లోని ఒంటరి మహిళలకు ఈ కార్యక్రమం అమల్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అయితే ఎగ్ మార్ట్ ఏర్పాటు చేసుకునే మహిళలు వ్యాపారానికి సంబంధించి స్వీయ ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది.. వ్యాపార అనుభవం, ట్రైనింగ్‌ అంగీకారానికి సంబంధించి ధృవీకరిస్తూ ఓ పత్రం అందించాలి. స్టోర్ శుభ్రంగా ఎలా పెట్టుకోవాలి..? ఎలా విక్రయించాలి..? వ్యాపారం ఎలా పెంచుకోవాలి? అనే విషయాలపై మహిళలకు శిక్షణ అందించనున్నారు. ఈ ఎగ్ మార్ట్‌ల ఏర్పాటుతో మహిళలు ఎక్కువగా ఆదాయం పొందవచ్చని మెప్మా అధికారులను చెబుతున్నారు. మహిళలు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *