Andhra: ఓరి పిచ్చోడా.. చేతులారా ప్రాణాలు పోగుట్టుకున్నావ్.. రీల్స్ చేస్తుంటే యముడే షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. వీడియో

Andhra: ఓరి పిచ్చోడా.. చేతులారా ప్రాణాలు పోగుట్టుకున్నావ్.. రీల్స్ చేస్తుంటే యముడే షేక్ హ్యాండ్ ఇచ్చాడు.. వీడియో


ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికి రీల్స్ పిచ్చి పెరిగిపోయింది. ముఖ్యంగా యువత రీల్స్ చేసే పనిలో పడి వారి ప్రాణాలు కోల్పోతున్నారు.. బైక్ లను నడిపి భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు.. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయి కుటుంబానికి చేదు జ్ఞాపకాలు మిగుల్చుతున్నారు. తాజాగా అలాంటి సంఘటన ఒకటి.. ఏపీలో కలకలం రేపింది.. కడప నగరంలోని విమానాశ్రయం రోడ్డులో యువత బైక్ పై కళ్ళు గగుర్పొడిచే స్టంట్లను చేస్తూ రోడ్లపై వెళ్ళే ప్రయాణికులను కూడా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. స్పీడ్ గా వెళ్ళడం ముందు టైర్ ను గాలిలోకి లేపడం.. ర్యాష్ డ్రైవింగ్.. భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి.. విజువల్స్ చూస్తే ఎంత భయంకరంగా ఉన్నాయంటే యువతను వారి తల్లిదండ్రులు రోడ్డుపైకి పంపాలంటేనే ప్రాణాలు అరచేతులో పెట్టుకొని పంపించాల్సి వస్తుంది.

కడప నగరంలోని ముబారక్ అనే యువకుడు మరో యువకుడితో కలిసి అర్థరాత్రి ఒంటి గంట సమయంలో రీల్స్ కోసం బైక్ రైడ్స్ చేస్తూ డివైడర్ ను ఢీకొని చనిపోయాడు.. బైక్ పై నుండి కిందపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతనిని మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు తరలించి నట్టు సమాచారం ..

వీడియో చూడండి..

పోలీసులు నిత్యం నిఘా పెట్టినా.. డ్రోన్ లతో సెర్చ్ చేస్తున్నా.. ఇలాంటి వారు మాత్రం.. రోడ్లపై హల్ చల్ చేస్తూనే ఉన్నారు. అయితే, తల్లి దండ్రులు తమ పిల్లలప దృష్టి పెట్టాలని.. అలాగే.. పోలీసులు రీల్స్ చేసే యువతకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *