Parasakthi Movie : ఓటీటీలోకి పరాశక్తి.. నేరుగా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..

Parasakthi Movie : ఓటీటీలోకి పరాశక్తి.. నేరుగా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్.. ఎక్కడ చూడొచ్చంటే..


కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. విభిన్న కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల సంక్రాంతి పండగ సందర్భంగా పరాశక్తి మూవీతో అడియన్స్ ముందుకు వచ్చాడు. కానీ అదే సమయంలో తెలుగులో చాలా సినిమాలు విడుదల కావడంతో.. థియేటర్స్ కొరత ఏర్పడింది. దీంతో ఈ చిత్రాన్ని కేవలం తమిళంలో మాత్రమే విడుదల చేశారు. డైరెక్టర్ సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. మరోవైపు జననాయగన్ వాయిదా పడడంతో ఈ చిత్రాంపై తీవ్ర విమర్శలు వచ్చినప్పటికీ రూ.100 కోట్లకు పైగానే వసూల్లు రాబట్టింది. ఇందులో ఎప్పటిలాగే శివకార్తికేయన్ నటనతో ఆకట్టుకున్నాడు.

ఎక్కువ మంది చదివినవి: JD Chakravarthi: అది బూతు పాట అని నాకు తెలీదు.. ఒక్కసారిగా షాకయ్యా.. నటుడు జేడీ చక్రవర్తి.

పరాశక్తి సినిమా ఇప్పుడు ఓటీటీలో విడుదలయ్యేందుకు రెడీగా ఉంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు కన్నడ, మలయాళం, తమిళం భాషలలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే రెమో, ప్రిన్స్, అమరన్ చిత్రాలతో తెలుగులో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు శివకార్తికేయన్. దీంతో ఇప్పుడు పరాశక్తి సినిమా కోసం తెలుగు ఫ్యా్న్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల కథానాయికగా నటించింది. ఈ మూవీతోనే తమిళంలోకి అడుగుపెట్టింది శ్రీలీల.

ఎక్కువ మంది చదివినవి: Folk Song : ఏం పాట రా బాబు.. యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న ఫోక్ సాంగ్.. వింటే స్టెప్పు వేయాల్సిందే..

ఈ సినిమాను 1965లో తమిళనాడులో హిందీ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో తెరకెక్కించారు. ఆ సమయంలో భారత కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను తమిళులపై బలవంతంగా రుద్దడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ఉద్యమాలు చేశారు. ఆ సమయంలో ఇద్దరు సోదరులు చెజియాన్, చిన్నదురై జీవితాలు ఎలా ప్రభావితం అయ్యాయి అనేది సినిమా. ఈ మూవీ రానా దగ్గుబాటి అతిథి పాత్రలో కనిపించారు.

ఎక్కువ మంది చదివినవి: Director Rajamouli : అతడి కోసం 15 ఏళ్లుగా వెయిటింగ్.. ఎప్పుడెప్పుడు కలిసి సినిమా చేద్దామా అని చూశా.. ఎస్ఎస్ రాజమౌళి..

ఎక్కువ మంది చదివినవి: Tollywood : టీమిండియాలో తోపు క్రికెటర్.. ఒక్క తప్పుతో తీహార్ జైలుకు.. ఇప్పుడు హీరోగా రచ్చ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *