ఉత్తర ప్రదేశ్లోని వారణాసిలో ఈ షాకింగ్ ఘటన జరిగింది. వారణాసిలో విమలేష్ మిశ్రా అనే పూజారి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు స్కూలులో చదువుతున్నాడు. ఆ బాలుడే .. తనకిష్టమైన స్నాక్ కోసం ఆ చిన్నారి ఏకంగా రూ. 85 లక్షల విలువైన కుటుంబ ఆభరణాలను వీధి వ్యాపారులకి అప్పగించాడు. బాలుడి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న ముగ్గురు వ్యాపారులు అతడిని మాయమాటల్లో పెట్టి భారీ దోపిడీ చేసారు. అయితే ఈ దారుణం చాలా కాలం పాటు ఎవరికీ తెలియకుండా సాగిపోయింది. కానీ ఇటీవలే విమలేష్ మిశ్రా సోదరి వచ్చి.. అన్నగారింట్లో దాచిపెట్టిన తన నగలను ఇవ్వమని అడగగా, అసలు సంగతి బయటపడింది.
మరిన్ని వీడియోల కోసం :