Shukra Dosham: జాతకంలో శుక్ర దోషమా?.. శివయ్యకు ఈ ఒక్కటీ సమర్పిస్తే అడ్డంకులన్నీ మటాష్..

Shukra Dosham: జాతకంలో శుక్ర దోషమా?.. శివయ్యకు ఈ ఒక్కటీ సమర్పిస్తే అడ్డంకులన్నీ మటాష్..


మన జాతకంలో శుక్రుడు, బుధుడు బలహీనంగా ఉంటే జీవితంలో సుఖశాంతులు కరువవుతాయి. యాలకులు ఈ రెండు గ్రహాలను ప్రభావితం చేసే శక్తిని కలిగి ఉంటాయి. సోమవారం నాడు లేదా ప్రతిరోజూ ఉదయాన్నే శివాలయానికి వెళ్లి ఐదు యాలకులను శివలింగానికి సమర్పించడం వల్ల రాజయోగం పడుతుందని పురాణాలు చెబుతున్నాయి. వ్యాపారంలో విజయం నుండి మనశ్శాంతి వరకు యాలకుల పూజతో కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

శివలింగానికి యాలకులు సమర్పించడం వల్ల కలిగే 5 అద్భుత లాభాలు:

ఆర్థిక అభివృద్ధి: మీరు అప్పుల బాధతో ఉన్నట్లయితే, శివలింగానికి క్రమం తప్పకుండా యాలకులు సమర్పించండి. ఇది కుబేరుడి ఆశీస్సులను ఆకర్షించి, ఇంట్లో సంపద స్థిరంగా ఉండేలా చేస్తుంది.

శుక్ర దోష నివారణ: జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే విలాసవంతమైన జీవితం లభించదు. యాలకుల సువాసన శుక్రుడిని ప్రసన్నం చేసుకుంటుంది. దీనివల్ల సమాజంలో గౌరవం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మీ సొంతమవుతాయి.

అడ్డంకుల తొలగింపు: మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు ఎదురవుతుంటే.. ఐదు పచ్చి యాలకులను శివలింగంపై ఉంచి ధ్యానం చేయండి. ఇది అశుభ గ్రహాల ప్రభావాన్ని తగ్గించి విజయానికి మార్గం సుగమం చేస్తుంది.

వైవాహిక ఆనందం: వివాహంలో జాప్యం జరుగుతున్నా లేదా దంపతుల మధ్య గొడవలు ఉన్నా.. ‘ఓం నమః శివాయ’ మంత్రాన్ని జపిస్తూ యాలకులను సమర్పించడం వల్ల ఫలితం ఉంటుంది.

మనశ్శాంతి: మానసిక ఆందోళనతో బాధపడేవారు యాలకులు, గంగాజలంతో శివుడికి అభిషేకం చేస్తే మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

ఎలా సమర్పించాలి?

ప్రతిరోజూ ఉదయం స్నానం చేసిన తర్వాత స్వచ్ఛమైన మనస్సుతో శివాలయానికి వెళ్లాలి. కనీసం ఐదు పచ్చి యాలకులను శివలింగంపై ఉంచి, మీ కోరికను మనసులో చెప్పుకుంటూ కొద్దిసేపు ధ్యానం చేయాలి. ఇది చాలా ఫలవంతమైన చర్యగా పరిగణించబడుతుంది.

గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. జ్యోతిష్య ఫలితాలు అనేవి వ్యక్తుల జాతక చక్రం మరియు నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *