మున్సిపల్ ఎన్నికలు కొందరి ప్రాణాల మీదకు వచ్చాయి. నామినేషన్ వేసి విత్ డ్రా చేసుకున్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సకాలంలో గుర్తించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డుకు పస్తం మల్లమ్మ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమా మహేశ్వరి నామినేషన్ వేశారు. పస్తం మల్లమ్మ విత్ డ్రా చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉమా మహేశ్వరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో ఆ వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకగ్రీవం వద్దు మా వార్డుకు ఎన్నికలు జరపాలంటూ మున్సిపాలిటీ ఎదుట ఆందోళన చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో తమకు ఓటు హక్కు కల్పించకపోతే ఏకగ్రీవంగా ఎన్నికైన ఉమామహేశ్వరుని సీట్లో కూర్చొనియమని, తమ వార్డుకు ఎమ్మెల్యే రావాలని డిమాండ్ చేశారు.
మరోవైపు విత్ డ్రా చేసుకున్న మల్లమ్మపై వార్డులోని ఓటర్లు ఆరోపణలు చేశారు. డబ్బులు తీసుకుని నామినేషన్ ను విత్ డ్రా చేకుందని మల్లమ్మపై వార్డు ప్రజలు మండిపడ్డారు. దీంతో మనస్థాపం చెందిన మల్లమ్మ తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరి వేసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన స్థానికులు డోర్ పగలగొట్టి ఆమెను రక్షించారు. నామినేషన్ విత్ డ్రా చేసుకునేందుకు డబ్బులు తీసుకో లేదని చెబుతున్నా.. తనను మానసికంగా హింసిస్తున్నారని మల్లమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి మున్సిపల్ ఎన్నికలు ఓ అభ్యర్థి ప్రాణాల మీదకు తెచ్చుకుంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..