Post Office: రోజుకు రూ.100 ఆదాతో.. మీ చేతికి రూ. 2.14 లక్షలు.. పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?

Post Office: రోజుకు రూ.100 ఆదాతో.. మీ చేతికి రూ. 2.14 లక్షలు.. పోస్టాఫీస్ సూపర్ స్కీమ్ గురించి తెలుసా..?


ప్రస్తుత కాలంలో ఆర్థిక భద్రత అనేది ప్రతి ఒక్కరికీ అనివార్యం. అయితే మార్కెట్లో పెరుగుతున్న మోసాల నేపథ్యంలో సామాన్యులు తమ కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక సతమతమవుతున్నారు. అలాంటి వారి కోసం ప్రభుత్వ భరోసాతో నడిచే పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ ఒక అద్భుతమైన అవకాశం. చిన్న చిన్న మొత్తాలతో పెద్ద నిధిని సమకూర్చోకొవచ్చు. పోస్టాఫీస్ రికరింగ్ డిపాజిట్ అనేది ఐదు సంవత్సరాల కాలపరిమితి కలిగిన పొదుపు పథకం. ఇందులో మీరు ప్రతి నెలా కొంత నిర్ణీత మొత్తాన్ని జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత వడ్డీ రేటు ఏటా 6.7 శాతంగా ఉంది. ఇది ప్రభుత్వ పథకం కాబట్టి మీ పెట్టుబడికి పూర్తి గ్యారెంటీ ఉంటుంది.

రూ. 2 లక్షలు ఎలా పొందాలి?

మీరు రోజుకు కేవలం రూ. 100 ఆదా చేయగలిగితే, ఈ పథకం ద్వారా రూ. 2 లక్షలకు పైగా పొందవచ్చు..

నెలవారీ పెట్టుబడి: రోజుకు రూ.100 అంటే నెలకు రూ.3,000.

వార్షిక పొదుపు: ఏడాదికి మీరు జమ చేసే మొత్తం రూ.36,000.

5 ఏళ్ల కాలపరిమితి: ఐదేళ్లలో మీరు చేసే మొత్తం అసలు పెట్టుబడి రూ. 1,80,000.

వడ్డీతో కలిపి రిటర్న్స్: 6.7శాతం వడ్డీ రేటు ప్రకారం.. 5 ఏళ్ల తర్వాత మీకు లభించే మొత్తం రూ. 2,14,097

అంటే మీరు దాచుకున్న రూ. 1.80 లక్షలకు అదనంగా సుమారు రూ. 34,000 వడ్డీ రూపంలోనే లభిస్తుంది.

ఎవరు చేరవచ్చు?

  • భారతీయ పౌరులెవరైనా ఈ ఖాతాను తెరవవచ్చు.
  • మైనర్ల పేరిట తల్లిదండ్రులు ఖాతా ప్రారంభించే అవకాశం ఉంది.
  • కేవలం రూ. 100తో కూడా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు, గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *