ఏలూరులో పడమర వీధి గంగానమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. నగర వీధులు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సోమవారం ఈ జాతర సందర్భంగా కొర్లబండిపై అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. గంగానమ్మ మూడు నెలలుగా పడమర వీధిలో పూజలు అందుకున్నారు. ఏడేళ్లకు ఒకసారి ఏలూరులో జరిగే ఈ గంగానమ్మ జాతరను ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అనాదిగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జాతర నిర్వహణ సందర్భంగా మూడు నెలల పాటు ఏలూరు నగరంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
మరిన్ని వీడియోల కోసం :