నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో

నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో


నగరంలో పట్టపగలే రెచ్చిపోయిన దొంగలు వీడియో

సమాచారం ప్రకారం, ఇద్దరు వ్యక్తులు ఆటోలో షాహీన్‌నగర్‌కు వచ్చారు. రోడ్డు పక్కన కట్టేసి ఉన్న ఓ మేకను గమనించిన వారు చాకచక్యంగా దానిని విప్పి, ఎవరూ చూడనట్లు తమ ఆటోలో ఎక్కించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ మొత్తం ఘటన అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. చోరీ జరిగిన తీరును చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ ఘటనపై బాధితుడు బాలాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. ఘటనపై స్థానిక ప్రజలు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలే ఇలా దొంగతనాలు జరుగుతున్నాయంటే, రాత్రి వేళ భద్రతపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి చోరీలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *