టీ20 ప్రపంచ కప్‌లో ఓమన్‌తో ఫిబ్రవరి 9న జరిగే తొలి మ్యాచ్‌లో జింబాబ్వే తరపున బ్రెండన్ టేలర్ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ మ్యాచ్ తో ఈ దిగ్గజ ప్లేయర్ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు. ఐసీసీ రికార్డుల్లో తన పేరును శాశ్వతంగా లిఖించుకోనున్నాడు. 2007 టీ20 ప్రపంచ కప్, 2026 టీ20 ప్రపంచ కప్‌లో పాల్గొన్న ఆటగాడిగా భారీ రికార్డు సృష్టించనున్నాడు.