బుల్లితెరపై నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభాకర్. సీరియల్స్, షోల ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ఇప్పటికీ సీరియల్స్ ద్వారా అలరిస్తున్నారు. మరోవైపు ప్రభాకర్ కూతురు, కొడుకు సైతం సినీరంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు చంద్రహాస్ హీరోగా తెరంగేట్రం చేశాడు. తొలి చిత్రంతోనే నెట్టింట భారీ ట్రోలింగ్ ఎదుర్కొన్నాడు. తన ఫస్ట్ మూవీ ఈవెంట్లో ఆయన పలికించిన హావభావాలు చూసి యాటిట్యూడ్ స్టార్ అనే ట్యాగ్ ఇచ్చేశారు. ఇప్పుడు మరో సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు చంద్రహాస్. బరాబర్ ప్రేమిస్తా అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈనెల 6న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో జరిగిన వేడుకలో చంద్రహాస్ స్టేజీపై పాడిన పాట ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపింది.
ఎక్కువ మంది చదివినవి: Jabardasth: పెద్ద హీరో సినిమాలో ఛాన్స్.. మొహం మీదే వద్దని చెప్పా.. జబర్దస్త్ బ్యూటీ..
కుటుంబ సభ్యులు, మహిళలు, సినీప్రముఖులు హాజరైన సభలో బూతు పాటను పాడాడు. దీంతో అతడి తీరుపై నెటిజన్స్ మండిపడుతున్నారు. అందరి ముందు అలాంటి పాడ పాడడం ఏంటనీ సీరియస్ అవుతున్నారు. దీంతో అతడి తీరుపై నెట్టింట ట్రోల్స్ వస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్ లో ఉన్న జేడీ చక్రవర్తి తాజాగా ఆ ఘటనపై స్పందించారు. చంద్రహాస్ పాడుతున్నప్పుడు తాను కూడా షాక్ లో ఉన్నానని.. అసలు అతడు ఏం పాడుతున్నాడో తనకు అర్థం కాలేదని అన్నారు. కానీ ఆ పాటను తాను ఎంజాయ్ చేసినట్లు వీడియో ఎడిట్ చేసి నన్ను ట్రోల్ చేస్తున్నారని అన్నారు. ఫుల్ వీడియో చూస్తే అర్థమవుతుందని.. ఇలాంటి వేడుకలలో గెస్టులు మాట్లాడేది వినరు.. పక్కనున్న వారితో మాట్లాడటం.. తెలిసినవారిని పలకరిస్తూ ఉండిపోతారు. నా పక్కన అమ్మాయికి తెలుగు అర్థం కాక చప్పుట్లు కొట్టింది. అది చూసి నేను చప్పట్లు కొట్టానని అంటున్నారు. నేను బూతులు మాట్లాడను.. ఎవరైనా మాట్లాడిన సహించను అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Uday Kiran : ఆ చెత్త సినిమాలే నా కెరీర్ను నాశనం చేశాయి.. ఉదయ్ కిరణ్ ఎమోషనల్ కామెంట్స్..
అతడు బూతులు పాడుతున్నాడని చెప్పడంతో ఆమె షాకైంది. చంద్రహాస్ పాడుతుంటే జయంత్, నేను ఒకరి మొహాలు ఒకరం చూసుకుని షాకయ్యం. అప్పుడే అక్కడి నుంచి లేచి వెళ్లిపోదామనుకున్నా..కానీ పూజా హేడీ పక్కకు తీసుకెళ్లి అలా చేయొద్దని చెప్పింది. నేను వెళ్లిపోతే సినిమాపై నెగిటివ్ ఎఫెక్ట్ పడుతుంది. కానీ చంద్రహాస్ అలా చేయడాన్ని నేను సమర్థించను.. చెత్త ప్రమోషన్లతో సినిమాలు ఆడతాయనుకుంటే వాళ్ల భ్రమే అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి: Dhandoraa Movie : దండోరా సినిమాలో బింధు మాధవి పాత్రలో ఆ హీరోయిన్ నటించాల్సింది.. కానీ.. డైరెక్టర్
ఎక్కువ మంది చదివినవి: Cinema : అర్థరాత్రి హోటల్లో అరుపులు.. 24 ఏళ్లుగా ఆ హీరోయిన్ను భయపెడుతున్న సినిమా.. ఇప్పటికీ..