దళపతి విజయ్ హీరోగా నటించిన జన నాయగన్ (తెలుగులో జన నాయకుడు) సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే, సెన్సార్ సమస్య ల కారణంగా ఈ మూవీ అనూహ్యంగా వాయిదా పడింది. ఇప్పటికీ ఈ మూవీ నిర్మాతలు కోర్టు చుట్టూనే తిరుగుతున్నారు. మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కూడా దగ్గర పడ్డాయి. ఒక వేళ ఎన్నికలు ప్రకటించిన తర్వాత, చిత్రం విడుదలను రెండు నెలల పాటు వాయిదా వేయాల్సి ఉంటుంది. ఈ కారణంగా, చిత్ర బృందం 20 నిమిషాల సన్నివేశాలని తగ్గించడానికి అంగీకరించినట్లు చెబుతున్నారు. జన నాయగన్’ సినిమా లో, విజయ్ కి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేలా కొన్ని సన్నివేశాలు, డైలాగులు ఉన్నాయని తెలుస్తోంది. అలాగే విజయ్ రాజకీయ పార్టీ భావజాలం, ఆదర్శాలను ప్రోత్సహించేలా సీన్స్,
అలాగే ప్రతిపక్ష పార్టీలను విమర్శించే కొన్ని సంభాషణలు, సన్నివేశాలు ఈ సినిమాలో ఉన్నాయి, అందుకే ‘జన నాయగన్’ కి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి CBFC వెనుకాడిందని చెబుతున్నారు.
కోర్టు కేసులో జాప్యం జరిగే అవకాశం ఉన్నందున, రాజకీయంగా సంబంధిత సన్నివేశాలన్నింటినీ కత్తిరించాలని చిత్ర బృందం ఇప్పుడు నిర్ణయించిందని చెబుతున్నారు. సినిమాలోని రాజకీయ అంశాల కారణంగా ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ క్రమంలోనే నిర్మాతలు వివాదాస్పద సన్నివేశాలు మరియు సంభాషణలన్నింటినీ తొలగించాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల కోర్టు విచారణ లేకుండానే CBFC సర్టిఫికెట్ జారీ చేస్తుందని భావిస్తున్నారు. అప్పుడు సినిమాను విడుదల చేయడంలో ఎటువంటి సమస్య ఉండదనుకుంటున్నారు. ‘జన నాయగన్’ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వం వహించారు. పూజా హెగ్డే ప్రధాన పాత్రలో నటించింది. మలయాళ నటి మమితా బిజు మరో ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ యజమాని వెంకట్ నిర్మించారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు.
ఇవి కూడా చదవండి
దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ అనే రాజకీయ పార్టీని స్థాపించారు. త్వరలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
విజయ్ పార్టీ అభ్యర్థులు తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.
ఫిబ్రవరిలో కుదరకపోతే ఇక రిలీజ్ అప్పుడే..
The film #JanaNayagan is now going to the Revising Committee 👀
– So, What is going to happen next ? Will it be released in February or after the election ?#ThalapathyVijay
I Think After Election 👍🏼
So What you Think Guys…..#JanaNayakudu #JanaNayaganCensor pic.twitter.com/ik97FoK1dX— Soby Bijun (@_mr_dom_) January 29, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.