కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే అయిపోతారు..!

కోడి మాంసం తింటున్నారా..? ముందు ఇది తెలుసుకోండి.. లేదంటే అయిపోతారు..!


చాలా మందికి చికెన్‌ పేరు వినగానే నోట్లో నీళ్లు ఊరిపోయేంత ఇష్టం ఉంటుంది. కానీ, మనం తినే కోడి మాంసం మన శరీరానికి బలాన్ని ఇస్తుందా లేదా వ్యాధులను తెస్తుందా..? అనేది మనం అర్థం చేసుకోవాలి.. కంట్రీ చికెన్, బ్రాయిలర్ మధ్య ఏది ఎక్కువ శక్తివంతమైనదో తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే.. బ్రాయిలర్ చికెన్ తక్కువ ధరకు లభిస్తుందని చాలా మంది కొంటారు. కానీ, వాటి పెంపకం వెనుక ఉన్న చేదు నిజం ఏమిటంటే అది మన ఆరోగ్యానికి హానికరం. బ్రాయిలర్ కోళ్లు త్వరగా పెరగడానికి హార్మోన్లు, యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వాటిని అతిగా తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్, తక్కువ రోగనిరోధక శక్తి, హార్మోన్ల అసమతుల్యత వంటి సమస్యలు వస్తాయి. ముఖ్యంగా, వాటిలో పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి.

దేశీ చికెన్.. పోషకాల గని: ప్రకృతి ఒడిలో పెరిగి సహజ ఆహారాన్ని తినే ఫ్రీ-రేంజ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. 100 గ్రాముల బ్రాయిలర్ చికెన్‌లో 150 కేలరీలు ఉండగా, ఫ్రీ-రేంజ్ చికెన్‌లో 120 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో చాలా తక్కువ కొవ్వు పదార్థం ఉంటుంది. ఇందులోని ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఫ్రీ-రేంజ్ చికెన్‌లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను నివారించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

నాటు కోడిలో ముఖ్యమైన పోషకాలు: నాటు కోడి మన శరీరానికి అవసరమైన ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది. ప్రోటీన్ కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. విటమిన్లు D, E, B-కాంప్లెక్స్ ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. జింక్, సెలీనియం, ఇనుము రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ఇవి కూడా చదవండి

మేక మాంసం కంటే కోడి మాంసంలో కొవ్వు తక్కువగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే నాటు కోడిని ఎంచుకోవడం మంచిది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *