PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు.. ఆ రెండు దేశాల మద్దతుతో పాక్ దూకుడు..?

PCB vs ICC: ఐసీసీకి పోటీగా మరో క్రికెట్ బోర్డ్ ఏర్పాటు.. ఆ రెండు దేశాల మద్దతుతో పాక్ దూకుడు..?


PCB Plans New Cricket Body Over ICC: టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగిన తర్వాత నుంచి పాకిస్తాన్ పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తోంది. పూటకో మాటతో అటు ఐసీసీతోపాటు ఇటు బీసీసీకి కొత్త తలనొప్పులు తెస్తోంది. తాజాగా టీ20 ప్రపంచకప్ లో భారత జట్టుతో మ్యాచ్ ఆడమంటూ విమర్శలు పాలైన పీసీబీ.. మరో కొత్త వివాదానికి తెర లేపింది. ఇప్పటి వరకు ఐసీసీ ప్రపంచ క్రికెట్ ను శాసిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పాకిస్తాన్ మరో కొత్త క్రికెట్ బోర్డ్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)కి సమానంగా మరో ప్రపంచ స్థాయి క్రికెట్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు లీకులు చేసింది. దీంతో క్రికెట్ ప్రపంచం ముందు మరోసారి నవ్వులపాలైంది పీసీబీ. ఐసీసీ నిర్ణయాలు పీసీబీకి వ్యతిరేకంగా ఉన్నాయనే కారణంతో ఈ కొత్త బోర్డ్ ఏర్పాటు చేయాలని చూస్తోందంట. ఈ బోర్డ్ ఏర్పాటు కోసం సైలెంట్ గా పని మొదలుపెట్టి ఏకంగా 8 దేశాల క్రికెట్ బోర్డులను సంప్రదించిందంట. ఐసీసీ ఆగడాలను అడ్డుకోవాలని పిలిపునిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ ప్రతిపాదనతో యూఏఈ, ఓమన్, సౌదీ అరేబియా, అమెరికా, వెస్టిండీస్, జింబాబ్వే వంటి దేశాలు ఏకీభవించకపోవడంతో పీసీబీ నవ్వుల పాలైంది.

పాక్ కుట్రలకు చైనా, బంగ్లాదేశ్ మాత్రం జెండా ఊపాయని, పై ఆరు దేశాలు వ్యతిరేకించడంతో పీసీబీ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కేవలం బంగ్లాదేశ్ కోసం టీ20 ప్రపంచకప్ 2026లో ఆడమంటూ చెప్పిన పీసీబీ, ఆ తర్వాత పరిస్థితులు అర్థం చేసుకుని, కేవలం భారత జట్టుతో మాత్రం ఆడమంటూ చెప్పుకొచ్చింది. ఈక్రమంలో ప్రపంచ క్రికెట్ పై భారత్ ఆధిపత్యాన్ని తగ్గించాలనే కుట్రతో ఈ కొత్త ప్రతిపాదన చేసింది. కానీ, ఆరు దేశాలు వ్యతిరేకించడంతో ఆదిలోనే అవమానాన్ని ఎదుర్కొంది. ఇప్పటికే దేశంలో ఆర్థిక సంక్షోభంతో ఇబ్బందుల ఎదుర్కొంటున్న పాక్.. ఇలాంటి చెత్త ఐడియాలను నూరిపోస్తోంది.

ఈ విషయం బయటకు పొక్కడంతో అటు నెటిజన్లు, ఇటు మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు. నిధులతోపాటు మౌలిక సదుపాయాలు అలాగే సభ్య దేశాల మద్దతు లేకుండా ఐసీసీ వంటి దిగ్గజ సంస్థకు పోటీగా ప్రయత్నాలు చేయడం పీసీబీ అవివేకానికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

సొంత జట్టు ప్రదర్శనపై ఫోకస్ చేయకుండా, ఇలాంటి చెత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టడం వల్ల పాక్ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనా, బంగ్లాదేశ్ మద్దతుతో ప్రపంచాన్ని ఏలేద్దామనే కన్నింగ్ ఐడియాతో ముందుకు రావడం హాస్యస్పదమంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *