ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం.. నాన్నకు ప్రేమతో కూతుళ్లు ఏం చేశారంటే..?

ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం.. నాన్నకు ప్రేమతో కూతుళ్లు ఏం చేశారంటే..?


ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం.. నాన్నకు ప్రేమతో కూతుళ్లు ఏం చేశారంటే..?

తండ్రి కూతుళ్ళ మధ్య బంధం గురించి ఎంత చెప్పినా తక్కువే. నాన్నకు కూతురు అంటే పంచ ప్రాణాలు.. తండ్రికి తన కూతురు మరో అమ్మ అయితే.. ఆ కూతురికి తండ్రి ఒక హీరోగా, ఇలలో నడిచే దైవంగా భావిస్తుంటారు. నవ మాసాలు మోసి జననం ఇవ్వకపోయినా… తన జన్మకు కారణమైన తండ్రి అంటే కూతురికి పంచప్రాణాలు. అలాంటి నాన్న కోసం ఈ కూతుళ్లు విగ్రహం ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన వీరమళ్ల నర్సింహ, ఆండాలు దంపతులకు ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ జీవనం సాగించే నరసింహ.. కూతుళ్లను కొడుకులు మాదిరిగా పెంచి పెద్ద చేశాడు. ఉన్నంతలో వీరిని చదివించి పెళ్లిళ్లు కూడా చేశారు.

కూతుళ్లు అంటే నరసింహకు పంచప్రాణాలు. బిడ్డలకు పెళ్లిళ్లు చేసినా నిత్యం కూతుర్ల ఇంటికి వెళ్లి వస్తుండేవాడు. ఈ క్రమంలో గత ఏడాది జనవరిలో 27న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. హైదరాబాద్ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. తండ్రి మరణాన్ని కూతుళ్లు జీర్ణించుకోలేకపోయారు.

తమను విడిచిపెట్టి కానరాని లోకాలకు వెళ్లినా.. ఆ రూపం తమ కళ్లెదుటే ఉండాలని తండ్రి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కన్నతండిపై ఉన్న ప్రేమతో కుమార్తెలు గౌరవతి, మమత రూ.6 లక్షలు ఖర్చు చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. తండ్రీకూతుళ్ల బంధాన్ని చాటి చెప్పి స్ఫూర్తిగా నిలిచారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *