Gold Rates: బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. మిస్సవ్వకండి

Gold Rates: బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. మిస్సవ్వకండి


Gold Rates: బంగారం ధరలపై షాకింగ్ న్యూస్.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. మిస్సవ్వకండి

బంగారం, వెండి ధరలు క్రాష్ అవుతున్నాయి. రోజురోజుకి పడిపోతున్నాయి. మొన్నటివరకు ధరలు భారీగా పెరగ్గా.. గత మూడు రోజులుగా భారీగా డౌన్ అవుతున్నాయి. కేంద్ర బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ పరిస్థితులు బంగారం ధరల పెరుగుదలకు బ్రేక్ పడటానికి కారణాలుగా తెలుస్తున్నాయి. బడ్జెట్ ప్రకటన క్రమంలో షేర్ మార్కెట్లు కుప్పకూలగా.. పసిడి ధరలు కూడా పతనమవుతున్నాయి. బడ్జెట్ ప్రకటన తర్వాత గోల్డ్, సిల్వర్ ధరలు మరింతగా దిగజారిపోతున్నాయి. బంగారం ధరల్లో ఊహించని మార్పులతో అందరిలోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. నష్టపోకుండా ఉండేందుకు కొంతమంది ఇన్వెస్టర్లు బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో బంగారం ధరల పతనంపై ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రచయిత రాబర్ట్ కియోసాకి కీలక వ్యాఖ్యలు చేశారు.

నేను కొనుగోలు చేస్తున్నా

“ధరలు తగ్గినప్పుడే బంగారం, వెండి కొనుగోలు చేయాలి. ధరలు పెరిగినప్పుడు లాభాలు వస్తాయి. నేను బంగారం, సిల్వర్, బిట్ కాయిన్ కొనడానికి సిద్దంగా ఉన్నా. మీరు ఏం చేయబోతున్నారు” అంటూ కియోసాకి చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఈ సందర్భంగా ధనికులు, పేదల ఆలోచనలు వేర్వేరుగా ఎలా ఉంటాయనేది ఆయన వివరించారు. పేదలు ధరలు పడిపోయినప్పుడు భయంతో అమ్మేసుకుంటారని, కానీ ధనికులు ఇప్పుడు కొనుగోలు చేసి ధరలు పెరిగిన తర్వాత లాభపడతారని వ్యాఖ్యానించారు. ధనికులు నష్టాల్లో లాభాలను చూస్తారని, పేదలు భయాన్ని చూస్తారని తెలిపారు. మార్కెట్ పెరిగినప్పుడు కొనడం కాదని, తక్కువగా ఉన్నప్పుడు ధైర్యంతో కొనుగోలు చేయడం మంచి ఆలోచన అని సూచించారు. మన ఆలోచనలు మారితేనే మన భవిష్యత్ మారుతుందని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు.

ఇదే గొప్ప ఛాన్స్

భవిష్యత్తులో పెరిగే ఆస్తులను అంచనా వేసి ధనవంతులు కొనుగోలు చేస్తారని, మధ్యలో క్రాష్ అయినా భయపడరని కియోసాకి తెలిపారు. తెలివిగా పెట్టుబడులు పెట్టి దీర్ఘకాలంలో లాభాలు పొందుతారన్నారు. బంగారం, వెండి ధరలు పడిపోవడం కూడా అలాంటిదేనని అభిప్రాయపడ్డారు. కొంతమందికి ఇది నష్టమైనా, మరికొంతమందికి ఇది గొప్ప ఛాన్స్ అని రాబర్ట్ కియోసాకి తన ఎక్స్‌లో పేర్కొన్నారు. కాగా కియోసాకి ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి ట్విట్టర్‌లో తన అభిప్రాయాలను వెల్లడిస్తూ ఉంటారు. బంగారం ధరలు, డాలర్ బలహీనపడటం వంటి వాటిపై ఎప్పటిప్పుడు తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. భవిష్యత్తులో పసిడి ధరలు మరింత పెరుగుతాయంటూ ఆయన చెబుతూ వస్తోన్నారు. తాను బంగారం, వెండిపై మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు చెబుతున్నారు. వీటిపై పెట్టుబడులు పెట్టాలని సూచిస్తూ వస్తున్నారు. దీంతో రాబర్ట్ కియోసాకి సూచనలను చాలామంది పాటిస్తున్నారు. ఆయన చేసే ట్వీట్లను అందరూ ఫాలో అవుతూ పెట్టుబడి సలహాలు పొందుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *