Hyderabad: ఇదేం పోయేకాలంరా.. పట్టపగలు ఈ బద్మాష్‌లు చేసిన పనికి బిత్తరపోవాల్సిందే

Hyderabad: ఇదేం పోయేకాలంరా.. పట్టపగలు ఈ బద్మాష్‌లు చేసిన పనికి బిత్తరపోవాల్సిందే


దేశంలో బంగారం, వెండికే కాదు.. గొర్రెలు, మేకలకు డిమాండ్‌ పెరిగింది. నాన్‌వెజ్‌ కోసం ఆరాటం పెరగడంతో కిలో మటన్‌ ధర ఏకంగా వెయ్యి రూపాయలకు చేరింది. అందుకేనేమో అటు నగలు, ఇటు గొర్రెల చోరీలు పెరిగాయి. తులం బంగారం కొనాలంటే లక్షన్నర రూపాయలు ఖర్చు చేయాలి. కిలో మటన్‌ కొనాలంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి. ఈ రూల్స్‌ అన్నీ నిజాయితీగా కష్టపడి పని చేసేవాళ్లకు మాత్రమే. ఎంచక్కా కొట్టేసేవారికి ఇవేమీ ఉండవు. అందుకే రోజురోజుకూ చోరీలు పెరుగుతున్నాయి.

హైదరాబాద్‌ షాహీన్‌ నగర్‌లో కొద్దిరోజులుగా ఇదే తరహా చోరీలు కొనసాగుతున్నాయి. నిత్యం ఏదో ఓ చోట గొర్రెలు, మేకలు ఎత్తుకెళ్లడం పరిపాటిగా మారింది. గొర్రెలను బ్యాగులోనో.. చేతుల్లోనూ ఎత్తుకెళ్లడం కుదరక ఏకంగా ఆటోలతో చోరీలు చేస్తున్నారు. అది కూడా పట్టపగలే. వీధుల్లో ఎవరూ లేని సమయంలో దొరికిన మేకను దొరికినట్లు ఎత్తుకెళ్లి సొమ్ము చేసుకుంటున్నారు. షాహీన్‌నగర్‌లో ఇద్దరు దొంగలు దర్జాగా ఆటోలో వచ్చి గొర్రెను ఎత్తుకెళ్లిన ఘటన అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. సీసీటీవీలో నమోదైన చోరీ దృశ్యాలను చూసి పోలీసులు సైతం నివ్వెరపోతున్నారు. నిత్యం గొర్రెల చోరీలు జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని స్థానికులు, బాధితులు ఆరోపిస్తున్నారు. రాత్రుళ్లు గస్తీలేకపోవడమే చోరీలకు కారణంగా చెబుతున్నారు. చోరీ అయిన గొర్రెల యజమానుల ఫిర్యాదుతో దొంగల కోసం పోలీసులు గాలింపు మొదలెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పాతబస్తీ మొత్తం జల్లెడపడుతున్నారు.

ఇది చదవండి: అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *