Gold Prices: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఒకేసారి ఎంతంటే..? సోమవారం రేట్లు ఇవే..

Gold Prices: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఒకేసారి ఎంతంటే..? సోమవారం రేట్లు ఇవే..


Gold Prices: మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఒకేసారి ఎంతంటే..? సోమవారం రేట్లు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. గత కొంతకాలం నుంచి ఒక్కసారిగా పతనమవుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అధ్యక్షుడిగా నూతన వ్యక్తిని ట్రంప్ త్వరలో నియమించనున్నారనే వార్తలతో గోల్డ్, సిల్వర్ ధరలు పడిపోతున్నాయి. ఊహించని రీతిలో గోల్డ్ రేట్లు తగ్గుముఖం పడుతున్నాయి. గత వారంలో బంగారం, వెండి ధరలు భారీ స్థాయిలో పెరగ్గా.. ఈ వారంలో దిగజారిపోతున్నాయి. దీంతో గోల్డ్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది మంచి సమయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న గోల్డ్ తగ్గగా.. సోమవారం కూడా డౌన్ అయ్యాయి. ఫిబ్రవరి 2న దేశంలో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

బంగారం రేట్లు ఎలా ఉన్నాయంటే..?

-హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,60,570 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.1,60,580 వద్ద స్ధిరపడింది. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,47,190గా ఉంది. ఆదివారం ఇది రూ.1,47,200 వద్ద స్దిరపడింది

-ఇక విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,60,570 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,47,190 వద్ద స్ధిరపడింది.

-చెన్నైలో 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,62,540గా ఉంది. నిన్న ఈ ధర రూ.1,62,550 వద్ద స్ధిరపడింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,990 వద్ద కొనసాగుతోండగా.. నిన్న ఈ ధర రూ.1,49,000గా ఉంది

-బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,60,570గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,190 వద్ద స్ధిరపడింది

-ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,60,720 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,47,340గా ఉంది.

వెండి ధరలు ఇలా..

-ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.3,49,900గా ఉంది. నిన్న ఈ ధర రూ.3,50,000 వద్ద స్ధిరపడింది

-హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.3,19,900గా ప్రస్తుతం కొనసాగుతోంది. ఆదివారం రూ.3,20,0000 వద్ద స్ధిరపడింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు ఉన్నాయి

-చెన్నైలో కేజీ వెండి ధర రూ.3,19,900 వద్ద కొనసాగుతోంది

-బెంగళూరులో కేజీ సిల్వర్ రేటు రూ.3,49,900 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ ధర రూ.3,50,000 వద్ద స్ధిరపడింది.

 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *