ఆయన చనిపోయినప్పుడు నేను నాలుగురోజులు మనిషిని కాలేకపోయా.. శివాజీ రాజా ఎమోషనల్ కామెంట్స్

ఆయన చనిపోయినప్పుడు నేను నాలుగురోజులు మనిషిని కాలేకపోయా.. శివాజీ రాజా ఎమోషనల్ కామెంట్స్


విలన్ గా, కామెడీ విలన్ గా, హీరోగా, సహాయక నటుడిగా ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు నటుడు. ఇక ఇప్పుడు శివాజీ రాజా హీరో, హీరోయిన్స్ కు తండ్రిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఆయన.. గతంలో శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..  దివంగత ప్రముఖ నటుడు మరియు దర్శకుడు రంగనాథ్‌తో తనకున్న అనుబంధాన్ని, ఆయనతో తన ప్రయాణాన్ని పంచుకున్నారు. రంగనాథ్ గారు తనను ఎంతగానో ఆదరించేవారని, నా యాంబిషన్ ఏంటంటే నేను శివాజీరాజాని హీరోగా పెట్టి సినిమా తీయాలి. రెండో సినిమా కూడా అతనితోనే తీయాలి అని రంగనాథ్ గారు అనేక ఇంటర్వ్యూలలో చెప్పేవారని శివాజీరాజా గుర్తు చేసుకున్నారు.

ఈ మాటలు విన్నప్పుడు తాను ఆశ్చర్యపోయానని, ఎంతో గొప్ప నటుడైన రంగనాథ్ తన గురించి ఇలా అనడం తనను షాక్‌కు గురిచేసిందని శివాజీరాజా తెలిపారు. రంగనాథ్ వ్యక్తిగత జీవితంలోని కొన్ని సంఘటనలను కూడా శివాజీరాజా వివరించారు. ఆయన తన భార్యను ఎంతగానో ప్రేమించారని, ఆమె అనారోగ్యానికి గురైనప్పుడు రంగనాథ్ ఆమెను అద్భుతంగా చూసుకున్నారని, వీల్ చైర్‌లో ఉన్న ఆమెకు అందించిన సేవ ఎవరూ చేయలేనిదని కొనియాడారు. అయితే, రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడం తనను తీవ్రంగా కలచివేసిందని శివాజీరాజా ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో ఉదయకిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పుడు, రంగనాథ్ ఒక ఇంటర్వ్యూలో “ఉదయకిరణ్ సూసైడ్ చేసుకోబోయే ముందు నాకు ఫోన్ చేస్తుంటే నేను సూసైడ్ చేసుకోవటం తప్పు, చేసుకోవద్దు అని అతన్ని మార్చేవాడిని” అని చెప్పారని, అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకోవడం వెనుక ఎలాంటి బాధ ఉందో అర్థం కాలేదని శివాజీరాజా అన్నారు.  రంగనాథ్ మరణం తర్వాత నాలుగు-ఐదు రోజుల పాటు తాను మనిషిని కాలేకపోయానని అన్నారు. చిరంజీవి గారికి కూడా రంగనాథ్ అంటే చాలా ఇష్టమని, సింగపూర్‌లో సినిమా చేసినప్పుడు వారిద్దరూ రూమ్‌మేట్స్ అని శివాజీరాజా పేర్కొన్నారు. రంగనాథ్ అంతులేని ఆప్యాయత, ఆయన జీవితంలోని సంఘటనలు, తనతో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని శివాజీరాజా ఈ ఇంటర్వ్యూలో వివరించారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *