నందినగర్ ఇంట్లో KCR విచారణ ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమైంది. విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒకరు ఉండేందుకు అవకాశం కల్పించారు. కేసీఆర్ వెంట సంతోష్ ఉంటారని సిట్‌కి సమాచారం ఇచ్చింది లీగల్ టీమ్.. న్యాయ సహాయం కోసం అందుబాటులో అడ్వొకేట్ రాంచందర్‌రావు ఉన్నారు. విచారణ సమయంలో KTR ఇంట్లోనే ఉండనున్నారు. కుటుంబ సభ్యుడిగా ఇంట్లో ఉండేందుకు KTRకి అనుమతి ఇచ్చారు. హరీష్‌రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అంతా భవన్‌లోనే ఉన్నారు. అప్పటికే నందినగర్ ఇంటికి చేరుకున్న సిట్ అధికారులు.. ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
సిట్ విచారణపై ముఖ్యనేతలు, అడ్వొకేట్లతో KCR మీటింగ్ నిర్వహించారు. ఫామ్‌హౌస్ నుంచే అందరికీ భోజనాలు తెప్పించారు. ప్రస్తుతం నందినగర్ నివాసంలో KCRతోపాటు.. కేటీఆర్, హరీష్, ఆర్‌ఎస్ ప్రవీణ్, అడ్వొకేట్ మోహన్‌రావు ఉన్నారు. కేసీఆర్ ఇంటి పరిసరాల్లో ఐదుగురు డీసీపీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. నాలుగు అంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.