Bhumika : ఆ హీరోకు యోగా నేర్పిస్తూ భూమికకు లైన్ వేశా.. అసలు విషయం బయట పెట్టిన హీరోయిన్ భర్త..

Bhumika : ఆ హీరోకు యోగా నేర్పిస్తూ భూమికకు లైన్ వేశా.. అసలు విషయం బయట పెట్టిన హీరోయిన్ భర్త..


టాలీవుడ్ హీరోయిన్ భూమిక తిరిగి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం యుఫోరియా అనే చిత్రంలో కీలకపాత్రలు నటిస్తుంది. ఈ క్రమంలో కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన బ్యూటీ సీక్రెట్స్ రివీల్ చేసింది. కేవలం ఆహారం, నిద్ర మాత్రమే కాకుండా, ఆమె తన జీవనశైలిలో సరైన ఆహారం, తగినంత నీరు, కొద్దిపాటి వ్యాయామంతో పాటు ఒత్తిడి లేని జీవితం, ఆనందానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె భర్త భరత్ ఠాకూర్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొని వారి ప్రేమకథలోని ఆసక్తికరమైన సంఘటనలను పంచుకున్నారు. భూమిక తన భర్త భరత్ ఠాకూర్ ను మొదటిసారి సల్మాన్ ఖాన్ పుట్టినరోజు పార్టీలో కొన్ని సంవత్సరాల క్రితం కలిశానని చెప్పారు. యోగా నేర్చుకోవాలనే ఆసక్తితో ఆమె భరత్ నెంబర్ తీసుకున్నానని, కానీ “యోగ తో సిఖ నహి, షాది కర్లీ” (యోగా నేర్చుకోలేదు, పెళ్లి చేసుకున్నాం) అని సరదాగా అన్నారు. తామిద్దరం ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నామని ఆమె వివరించారు.

అనంతరం భరత్ ఠాకూర్ తమ ప్రేమకథ గురించి తన వెర్షన్ ను వివరించారు. తాను భూమికను సంవత్సరాల క్రితం కలుసుకోకముందే, ఒక సినిమాలో ఆమెను చూశానని చెప్పారు. అది రోజా కూటం సినిమా అని, ఆ సినిమా చూసిన మూడు గంటల్లోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానని, ఆ స్క్రీన్‌పైనే ఆమెతో “ఫ్లర్ట్” చేశానని తెలిపారు. సినిమా చూసిన తర్వాత తన స్నేహితులతో “నేను ఈ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పినట్లు పేర్కొన్నారు. తన స్నేహితులు ఆమె చాలా ధనవంతురాలు అని చెప్పినప్పుడు, తాను కూడా ధనవంతుడిని కావాలని లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి పనిచేశానని అన్నారు. నెలకు ఇరవై, ముప్పై వేల రూపాయలు సంపాదించే స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదిగానని భరత్ తెలిపారు. భూమికకు ఇదంతా తర్వాత, ఒక సంవత్సరం తర్వాత మాత్రమే తెలిసిందని ఆమె స్పష్టం చేశారు. ఒక అమ్మాయిని ఆకట్టుకోవడం ఒక కళ అని, దానిని అందంగా ప్రదర్శించాలన్నారు భరత్.

భరత్ అప్పట్లో ముంబైలో అనేక మంది సెలబ్రిటీలకు యోగా శిక్షణ ఇస్తున్నారని, సల్మాన్ ఖాన్ తో కూడా తనకు మంచి పరిచయం ఏర్పడిందని చెప్పారు. సల్మాన్ ద్వారా భూమికను కలవడానికి సహాయం కోరానని, సల్మాన్ ఆమె పుట్టినరోజు పార్టీలో పరిచయం చేస్తానని చెప్పి, ఆ తర్వాత తన స్నేహితుడికి భూమిక వద్దకు తీసుకెళ్లమని చెప్పారని వివరించారు. ఈ విధంగా వారిద్దరూ ఒకరినొకరు కలుసుకున్నారు. భూమిక భరత్ ను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించలేదని, కానీ భరత్ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని ఆమె అభినందించారు

సాధారణంగా తాను అహంకారాన్ని, దురహంకారాన్ని ఇష్టపడనని, అయితే భరత్ తన అహంకారాన్ని కూడా స్టైల్ గా ప్రదర్శిస్తాడని, అయినా కూడా అతనిలో ఒక వినయం, మధురానుభూతి, నిజాయితీ, స్వచ్ఛమైన ఆత్మ కనిపిస్తాయని భూమిక అన్నారు. భరత్ తో కూర్చోవడం తనకు ఆనందంగా ఉండేదని ఆమె తెలిపారు. వారి ప్రేమకథలో సల్మాన్ ఖాన్ పాత్ర, భరత్ హాస్యభరితమైన, లక్ష్యంతో కూడిన ప్రేమ ప్రయత్నం ఆకట్టుకున్నాయి.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *