అది ఇది వద్దు.. మటన్‌లోని ఈ పార్ట్ తినండి చాలు.. మస్త్ మజా ఇస్తదంతే..

అది ఇది వద్దు.. మటన్‌లోని ఈ పార్ట్ తినండి చాలు.. మస్త్ మజా ఇస్తదంతే..


నాన్‌వెజ్ ప్రియులు మటన్ (మేక మాంసం) ను ఎంతో ఇష్టంగా తింటారు.. భారతీయ వంటకాల్లో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మేక తిల్లి కర్రీకి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక రుచికరమైన వంటకం మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందించే స్పెషల్ పదార్థం. శరీరంలో రక్తహీనతతో బాధపడేవారు వారానికోసారి ఈ తిల్లి కర్రీని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరుగుతుందని, తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలకు మేక తిల్లి కర్రీ ఒక శక్తివంతమైన, పోషక విలువలున్న వంటకం. ఇది రక్తవృద్ధికి సహాయపడటమే.. కాకుండా.. వారిని ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. అలాగే.. అలసట, బలహీనతను తగ్గించి.. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది.

అయితే.. మటన్ తిల్లిలో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. మేక తిల్లి (Mutton Spleen) ఐరన్, ప్రోటీన్, ముఖ్యమైన ఖనిజాల గనిగా ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. హిమోగ్లోబిన్ స్థాయిలను గణనీయంగా పెంచడంతోపాటు.. అలసట, బలహీనతను తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచడంలో, అలాగే శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో ఇది బాగా సహాయపడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు. నెలకు రెండు, మూడు సార్లైనా తినడం మంచిదని పేర్కొంటున్నారు.

తిల్లి కర్రీ తయారీ విధానం..

ముందుగా, తగ్గినంత తిల్లిని తీసుకోని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కడాయిలో రెండు చెంచాల నూనె వేడి చేసి, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయించాలి. అవి వేగాక, ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చెంచా పసుపు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తిల్లి ముక్కలను వేసి, రంగు మారేవరకు వేయించాలి. తర్వాత, రెండు చిన్న టమాటా ముక్కలు, ఒక చెంచా కారం, ఒక చెంచా ఉప్పు వేసి కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, తిల్లి మెత్తగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. చివరిగా, ధనియాల పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా కొద్దిగా వేసి కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసుకుంటే సరిపోతుంది.. లేదా.. తిల్లిని కొద్దిగా ఉడికించి.. ఆ తర్వాత కూడా కర్రీని అద్భుతంగా వండుకోవచ్చు.. మన ఇష్టాన్ని బట్టి కర్రీగా.. ఫ్రైగా కూడా చేసుకోని తినవచ్చు.. ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వైద్యులను సంప్రదించడం మంచిది.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *