శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా

శ్రీవారి ఆలయం ముందు ఇదేం పని.. అది తిరుమల రా అయ్యా


తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తులు కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. ఆథ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా ఇతర భక్తులకు ఇబ్బంది కలగకుండా అందరూ నడుచుకోవాల్సి ఉంటుంది. ఇది స్వామివారికి మనం ఇచ్చే గౌరవం. అయితే కొందరు ఈ నిబంధనలను పట్టించుకోకుండా వ్యవహరిస్తూ ఉంటారు. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో నిబంధనలకు విరుద్ధంగా ఓ నూతన జంట ఫోటోషూట్ చేసింది. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఆ జంట టీటీడీ అధికారులకు, భక్తులకు క్షమాపణలు తెలిపింది. తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్, గాయత్రీ దంపతులు జనవరి 28న తిరుమలలోని టీటీడీ కళ్యాణ వేదికలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం పసుపు వస్త్రాలతోనే శ్రీవారి ఆలయం ముందు ప్రాంతానికి చేరుకున్న వారు, కెమెరామెన్లతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ నిషేధమని నిబంధనలు ఉన్నప్పటికీ, ఈ ఫోటోలు అక్కడున్న భక్తుల దృష్టికి వెళ్లాయి. సెక్యూరిటీ సిబ్బంది గమనించకపోవడంతో ఆ వీడియోలు మీడియాకు చేరి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపై ఆరా తీసిన టీటీడీ సెక్యూరిటీ అధికారులు దంపతులను గుర్తించారు. ఆలయ నియమాల గురించి ముందుగా తెలియక అనుకోకుండా ఫోటోలు తీసినట్లు వారు వివరణ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసిన వెంటనే అన్ని ఫోటోలు, వీడియోలను తొలగించినట్లు తెలిపారు. ఈ అనుకోని తప్పుపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన వధూవరులు, భక్తులకు మరియు టీటీడీ అధికారులను క్షమాపణలు కోరారు. ప్రాయశ్చిత్తంగా శ్రీవారి సేవల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అవకాశం ఇవ్వాలని కోరారు. ఆలయ సంప్రదాయాలు, నియమాలను ప్రతి భక్తుడూ గౌరవించాల్సినవేనని ఈ ఘటన ద్వారా గుణపాఠం నేర్చుకున్నామని దంపతులు తెలిపినట్లు టీటీడీ ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తులసి వనంలో గంజాయి మొక్క అంటే ఇదేనేమో

Vitamin D: విటమిన్ డి ట్యాబ్లెట్లు తీసుకునే సరైన సమయం ఇదే

కొడుకు ప్రాణాల కోసం చిరుతతో పోరాడిన తండ్రి.. చివరికి

తవ్వే కొద్దీ బంగారు నాణేలు.. పరుగు పరుగున వెళ్తున్న జనాలు.. ఎక్కడంటే

హైదరాబాద్‌లో మరో నకిలీ డాక్టర్ గుట్టురట్టు.. అర్హతలు లేకున్నా వైద్యం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *