Budget 2026: చదువుకునే అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్..

Budget 2026: చదువుకునే అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఇకపై ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్..


కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. ఆత్మనిర్భర్ భారత్ కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారు.. ప్రజా వైద్యం.. సంక్షేమానికి పెద్ద పీట వేశారు. అంతేకాకుండా రైల్వే కారిడార్లు, సెమీ కండక్టర్ల రంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు చేశారు. అంతేకాకుండా.. ఎంఎస్ఎంఈ రంగాలకు కూడా కీలక ప్రకటనలు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఉన్నత విద్య కోసం పలు కీలక ప్రకటనలు చేశారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మించనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రతి జిల్లాలో బాలికల హాస్టళ్లను నిర్మిస్తామని వివరించారు. అంతేకాకుండా.. దేశవ్యాప్తంగా మూడు కొత్త ఎయిమ్స్‌లను నిర్మించనున్నట్లు ప్రకటించారు.

పశువైద్య కళాశాలలకు లోన్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ సపోర్ట్ స్కీమ్ తీసుకురానునట్లు తెలిపారు. ఆప్టోమెట్రీ, రేడియాలజీ, అనస్థీషియా వంటి 10 విభాగాలలో 1 లక్ష మంది అనుబంధ ఆరోగ్య నిపుణులను (AHPలు) సృష్టించనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు.

వృద్ధాప్య, NSQF కార్యక్రమాల కోసం 1.5 లక్షల మంది సంరక్షణ సిబ్బందిని నియమించనున్నట్లు తెలిపారు. ఆధ్యాత్మిక, వారసత్వ ప్రాముఖ్యత ఉన్న అన్ని పురావస్తు ప్రదేశాలను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

నిర్మలా సీతారామన్ బడ్జెట్ ఎలా ఉంది..

క్రీడల అభివృద్ధికి ఖేలో ఇండియా మిషన్.. మహిళల కోసం షీ మార్ట్స్ ఏర్పాటు.. ఈస్ట్ కోస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నేషనల్‌ డిజిటల్‌ విజ్ఞాన కేంద్రం ఏర్పాటు, గ్రాంట్ల రూపంలో రాష్ట్రాలకు రూ.1.40 లక్షల కోట్లు.. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఐటీ చట్టం అమలు చేయనున్నట్లు తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *