Lavanya Tripathi : క్లింకారకు ప్రమోషన్.. మీ అన్నయ్య వెయిటింగ్.. లావణ్య త్రిపాఠి ఆసక్తికర ట్వీట్..

Lavanya Tripathi : క్లింకారకు ప్రమోషన్.. మీ అన్నయ్య వెయిటింగ్.. లావణ్య త్రిపాఠి ఆసక్తికర ట్వీట్..


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరోసారి తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన భార్య ఉపాసన శనివారం పండంటి కవలలకు జన్మినిచ్చింది. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు బాబు, పాప జన్మించారని.. తమ ఇంట్లో ఆనందం డబుల్ అయ్యిందంటూ మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో మెగా ఫ్యామిలీతోపాటు ఫ్యా్న్స్ సైతం సంతోషంలో మునిగిపోయారు. చిరంజీవి, రామ్ చరణ్ దంపతులకు అభిమానులు, సినీప్రముఖులు విషెస్ తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే హీరో రామ్ చరణ్ దంపతులకు మెగా కోడలు.. వరుణ్ తేజ్ సతీమణి లావణ్య త్రిపాఠి అభినందనులు తెలియజేశారు. ట్వీన్స్ కు జన్మనిచ్చిన ఉపాసనకు కంగ్రాట్స్ తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Jabardasth Sujatha: యూబ్యూబ్ నుంచి మాకు ఎన్ని కోట్లు వస్తాయంటే.. జబర్దస్త్ సుజాత కామెంట్స్ వైరల్..

“హాయ్ చిట్టి కవలలు.. ఈ ప్రపంచంలోకి మీకు స్వాగతం.. ఇప్పటికే మిమ్మల్నీ అందరూ ప్రేమిస్తున్నారు. క్లింకారకు ఇప్పుడు అఫీషియల్ గా అక్కగా ప్రమోషన్ వచ్చింది. మీతోపాటు పెరిగేందుకు.. అల్లరి చేసేందుకు మీ అన్నయ్య వాయువ్ ఎదురుచూస్తున్నాడు” అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం లావణ్య చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. లావణ్య త్రిపాఠి, హీరో వరుణ్ తేజ్ కొన్నాళ్లు ప్రేమలో ఉండి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు గతేడాది బాబు జన్మించగా.. వాయువ్ అని నామకరణం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఇద్దరూ అక్కాచెల్లెల్లు.. ఒకరు స్టార్ హీరోయిన్.. మరొకరి జీవితం విషాదం.. ఎవరంటే..

మరోవైపు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు చిరు పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల శుభాకాంక్షలు తెలిపారు. 2026 సంవత్సరం ప్రారంభం నుంచే తమ కుటుంబానికి ఆనందాన్ని తెచ్చిందని.. చరణ్, ఉపాసనలు తనను మరోసారి అత్తయ్యను చేశారని అన్నారు. ఈసారి తమ ఆనందం రెట్టింపుగా ఉందని సుష్మిత తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Trending Song : 6 నెలలుగా యూట్యూబ్‌లో ట్రెండింగ్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్.. క్రేజ్ వేరేలెవల్..

ఎక్కువమంది చదివినవి : Karthika Deepam : కార్తీక దీపం సీరియల్ డాక్టర్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.. ? బుల్లితెర సూపర్ స్టార్ నిరుపమ్ పరిటాల..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *