జంతువులపై తమ ప్రేమను ఒక్కొక్కరు ఒక్కోవిధంగా చాటుకుంటారు. కొందరు వాటికి ఆహారం పెడితే, మరికొందరు వాటిని కుటుంబ సభ్యుల్లా చూసుకుంటారు. అసోంకు చెందిన ఓ జంతు ప్రేమికుడు ఒక అడుగు ముందుకేసి, తాను పెంచుకుంటున్న ఏనుగు పిల్ల పుట్టినరోజును ఘనంగా జరిపాడు. ప్రియాన్షి అలియాస్ ‘మోమో’ అని పిలుచుకునే ఈ ఏనుగు పిల్ల బర్త్‌డే వేడుకకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ జంతు ప్రేమికుడు ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఆ మూగజీవిపై ఆయన చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత నెటిజన్ల హృదయాలను కదిలించింది. ప్రియాన్షి కోసం ప్రత్యేకంగా పండ్లు, ధాన్యాలతో అలంకరించిన నీలి రంగు కేక్‌ను కట్ చేయించారు. పుట్టినరోజు మెనూలో భాగంగా అరటిపండ్లు, యాపిల్స్, ద్రాక్ష, కూరగాయలు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సిద్ధం చేశారు. బిపిన్, ప్రియాన్షి మధ్య ఉన్న అనుబంధానికి ఈ వేడుక అద్దం పడుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏనుగు పిల్ల క్యూట్‌నెస్‌కు ఫిదా అవుతున్నారు. ఒక యూజర్ స్పందిస్తూ, “జంతువులను ప్రేమించే వారంటే నాకు చాలా ఇష్టం.. మోమోకు పుట్టినరోజు శుభాకాంక్షలు” అని కామెంట్ చేశాడు. ఈ జీవాలను ప్రేమిస్తున్నందుకు లవ్ యూ బ్రదర్. దేవుడు నిన్ను చల్లగా చూడాలి” అని ఇంకొకరు రాశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తెలంగాణలో Ed.CET, ICET-2026 షెడ్యూల్స్ విడుదల
రైల్వే స్టేషన్‌లో గుండె పగిలే ఘటన.. చూస్తే గుండె తరుక్కుపోతుంది
Srisailam: భ్రమరాంబిక అమ్మవారికి బంగారు హారం
ఓర్నీ.. మటన్ బొక్క ఎంతపని చేసిందీ
రూ.99/- కే టికెట్…! హిట్టు కొట్టేందుకు మనోడి నయా స్ట్రాటజీ