IND vs NZ 4th T20I: దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..

IND vs NZ 4th T20I: దుబే దంచికొట్టినా.. వైజాగ్‌లో పోరాడి ఓడిన భారత్..


India vs New Zealand, 4th T20I: విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ACA-VDCA స్టేడియంలో జరిగిన నాల్గవ T20Iలో

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటిగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. టిమ్ సీఫెర్ట్ 62, డెవాన్ కాన్వే 44 పరుగులు చేశారు. కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

దుబే 15 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఊహించని పరిస్థితుల్లో 65 పరుగులకు రనౌట్ అయ్యాడు. రింకు సింగ్ 39, హార్దిక్ పాండ్యా 2, సంజు సామ్సన్ 24, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 8, అభిషేక్ శర్మ సున్నా పరుగులకే ఔటయ్యారు. మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టగా.. మ్యాట్ హెన్రీ, జాకబ్ డఫీ, జాక్ ఫౌల్క్స్ తలా ఒక వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి

రెండు జట్ల ప్లేయింగ్-11

భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్) , హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్.

న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), రాచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), జాక్ ఫౌల్క్స్, జాకబ్ డఫీ, ఇష్ సోధి, మాట్ హెన్రీ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *