Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం

Garimella Balakrishna Prasad: మరణానంతరం గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ పురస్కారం


ప్రముఖ అన్నమాచార్య సంకీర్తనల గాయకుడు, స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో 1978 నుంచి 2006 వరకు సుదీర్ఘ కాలం ఆస్థాన గాయకుడిగా సేవలందించారు. ఆయన 600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు అద్భుతమైన స్వరకల్పన చేశారు. వినరో భాగ్యము విష్ణు కథ, జగడపు చనువుల జాజర, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు వంటి సుప్రసిద్ధ కీర్తనలకు ఆయన స్వరాలు సమకూర్చి వాటికి జీవం పోశారు. బాలకృష్ణ ప్రసాద్ నవంబర్ 9, 1948న రాజమండ్రిలో జన్మించారు. గత ఏడాది మార్చి 9న తుదిశ్వాస విడిచారు. తమ తండ్రి చేసిన సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించడం పట్ల ఆయన కుమారుడు అనిల్ సంతోషం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vijay Anand Reddy: పద్మశ్రీ అవార్డుతో హ్యాపీ.. రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తా

ఫేక్ కలెక్షన్స్.. ఎవరి కోసం.. ఎందుకోసం..?

ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా.. స్టార్ హీరోల చూపు మాత్రం అటువైపే

Anil Ravipudi: అనిల్ రావిపూడి మాస్ ప్లానింగ్‌కు అందరూ ఫిదా

Samantha: ట్రెండింగ్ అవుతున్న సమంత.. అసలు కారణం ఇదే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *