మంచంపై లేదా దిండు కింద..
మంచంపై లేదా దిండు కింద ఫోన్ పెట్టుకుని నిద్రించడం చాలా చెడ్డ అలవాటు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇలా చేస్తే మాత్రం ఫోన్ పేలిపోయే ప్రమాదం ఉంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే ఎల్ఈడీ లైట్ మెలటోనిన్ ఉత్పత్తి, సిర్కాడియన్ లయలకు అంతరాయం కలిగిస్తుందని తాజా అధ్యయనం చెబుతోంది. అంతేగాక, నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయి. క్యాన్సర్, మెదడు కణితులకు కూడా ఇలాంటి అలవాట్లు కారణం కావచ్చని హెచ్చరిస్తున్నాయి.