
జైపూర్‌లోని బజాజ్ నగర్ ప్రాంతంలో ఫిబ్రవరి 12 గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ విషాదం చోటుచేసుకుంది. గోపాల్‌పుర నుంచి దుర్గాపుర రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న ఒక టాక్సీ.. నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న కూరగాయల బండిని బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. ఆ టాక్సీ గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చింది. అక్కడ కూరగాయలు అమ్ముకుంటున్న 50 ఏళ్ల మహేష్ సైని కాళ్లపై నుంచి కారు దూసుకెళ్లింది. అనంతరం అక్కడే పార్క్ చేసి ఉన్న మూడు బైకులు, ఒక లోడింగ్ వాహనం కూడా నుజ్జునుజ్జయ్యాయి. తీవ్ర గాయాలపాలైన మహేష్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.