8 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం..! భారత క్రికెటర్‌ దెబ్బకు మ్యాచ్‌ వన్‌సైడ్‌ అయిపోయింది..

8 ఫోర్లు, 7 సిక్సర్లతో విధ్వంసం..! భారత క్రికెటర్‌ దెబ్బకు మ్యాచ్‌ వన్‌సైడ్‌ అయిపోయింది..


భారత అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ యష్ ధుల్ 2025 ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL 2025)లో తన తొలి సెంచరీ సాధించాడు. ఈ ఎడిషన్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అతను నిలిచాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరఫున ఆడే ధుల్ DPL 2025 రెండో మ్యాచ్‌లో 56 బంతుల్లో 101 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లు ఉన్నాయి. యష్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 15 బంతులు మిగిలి ఉండగానే సెంట్రల్‌ ఢిల్లీ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

DPL 2025లో రెండవ మ్యాచ్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఓపెనర్ యష్ ధుల్ అద్భుతమైన సెంచరీ సాధించి తన జట్టును విజయపథంలో నడిపించాడు. అతను కేవలం 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 180 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 101 పరుగులు చేశాడు. యష్ ధుల్ టీం ఇండియా తరపున అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. అతని కెప్టెన్సీలో, టీం ఇండియా 2022లో అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. దీనితో పాటు అతను 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో కూడా ఆడాడు.

ఇప్పుడు అతను DPL రెండవ సీజన్‌లో సెంచరీ సాధించడం ద్వారా మంచి ఆరంభం చేశాడు. DPL 2025 లో జరిగిన రెండవ మ్యాచ్ లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. నార్త్ ఢిల్లీ ఓపెనర్ సార్థక్ రంజన్ 60 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 82 పరుగులు చేశాడు. అతనితో పాటు, అర్నవ్ బగ్గా 43 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 67 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు బ్యాట్స్ మెన్ తప్ప, ఏ బ్యాట్స్ మెన్ కూడా రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున మోని గ్రేవాల్, గవిష్ ఖురానా తలా రెండు వికెట్లు పడగొట్టారు. సిమర్జిత్ సింగ్, తేజస్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.

175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ జట్టు ఓపెనర్ యశ్ ధుల్ తో కలిసి మంచి ఆరంభాన్ని ఇచ్చింది. యశ్ తో పాటు, యుగల్ సైని 24 బంతుల్లో 5 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. అతనితో పాటు, కెప్టెన్ జాంటీ సిద్ధు 19 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ తో అజేయంగా 23 పరుగులు చేశాడు. ఈ విధంగా, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ 17.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేరుకుంది. నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ తరఫున కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *