సినిమా రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలన చిత్ర పురస్కారాలను కేంద్రం ఇటీవలే ప్రకటించింది. ఇందులో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మొత్తం ఏడు పురస్కారాలు దక్కాయి.
ఈ అవార్డుల్లో భాగంగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూతురు సుకృతి వేణి బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్ట్ పురస్కారానికి ఎంపికైంది. గాంధీ తాత చెట్టు సినిమాకు గాను సుకృతి వేణికి ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డు లభించింది.
ఈ నేపథ్యంలో ఆదివారం (ఆగస్టు 03) సుకుమార్ ఇంట్లో గ్రాండ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకల్లో సుకృతి తండ్రి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, తల్లి బబితా సుకుమార్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఈ వేడుకలకు సంబంధించిన ఫొటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేశారు సుకుమార్ కుటుంబ సభ్యులు. దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
ఇక గాంధీ తాత చెట్టు సినిమా విషయానికి వస్తే.. మల్లాది పద్మావతి తెరకెక్కించిన ఈ సినిమాలో సుకృతి వేణితో పాటు ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు
ఈ ఏడాది ప్రారంభంలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు ఈటీవీ విన్ లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. సుకుమారి కూతురు యాక్టింగ్ చూడాలనుకునేవారు ఈ మూవీపై ఓ లుక్కేసుకోవచ్చు.