5గురు హీరోలు రిజెక్ట్.. కట్‌చేస్తే ఫ్లాప్‌ల నటుడిని సూపర్ స్టార్‌గా మార్చిన సినిమా.. బాక్సాఫీస్‌కే దడ పుట్టించిందిగా

5గురు హీరోలు రిజెక్ట్.. కట్‌చేస్తే ఫ్లాప్‌ల నటుడిని సూపర్ స్టార్‌గా మార్చిన సినిమా.. బాక్సాఫీస్‌కే దడ పుట్టించిందిగా


5గురు హీరోలు రిజెక్ట్.. కట్‌చేస్తే ఫ్లాప్‌ల నటుడిని సూపర్ స్టార్‌గా మార్చిన సినిమా.. బాక్సాఫీస్‌కే దడ పుట్టించిందిగా

1973లో లక్షల్లో నిర్మించిన ఒక సినిమా విడుదలైంది. కానీ, అది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి కోట్లు సంపాదించింది. ఎన్నో కష్టాలు పడిన నటుడిని సూపర్ స్టార్‌గా చేసింది ఈ సినిమా. ముందుగా ఈ సినిమాను ఐదుగురు హీరోలు తిరస్కరించారు. ఆ తర్వాత వారంతా పశ్చాత్తాపపడేలా చేసింది ఈ సినిమా. అసలు ఈ బ్లాక్ బస్టర్ సినిమా, దానికి సంబంధించిన స్టోరీని ఇప్పుడ తెలుసుకుందాం..

1970లో మొదలైన ఈ స్టోరీని ఆ కాలంలోని ఐదుగురు హీరోలు వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. కొంతమందికి అప్పటికే ప్రాజెక్టులు, కమిట్‌మెంట్‌లు ఉండడంతో ఈ సినిమాను వదులుకున్నారు. అయితే చాలామంది ఈ సినిమా ఆఫ్‌బీట్ స్టోరీ గురించి కొంచెం సందేహించి పక్కన పెట్టేశారు. చివరికి ఈ సినిమా పరాజయం పాలైన ఒక నటుడి చేతికి చేరింది. అతను పరిశ్రమను విడిచిపెట్టాలని ఆలోచిస్తున్న సమయంలో ఈ కథ చేరింది.

ఆ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ షహెన్‌షా అమితాబ్ బచ్చన్. ఆ సినిమా పేరు ‘జంజీర్’. భారతీయ సినిమాకు కొత్త కోణాన్ని పరిచయం చేసిన సినిమా ఇదే. రొమాంటిక్ హీరోల ట్రెండ్ నుంచి ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ని సృష్టించింది ఈ సినిమా. సలీం-జావేద్ స్టోరీ అందించగా ప్రకాష్ మెహ్రా దర్శకత్వం వహించారు. ‘జంజీర్’ సినిమా కేవలం రూ.90 లక్షల బడ్జెట్ తో నిర్మించారు. బాక్సాఫీస్ వద్ద రూ.17 కోట్లు వసూలు చేసి సూపర్ హిట్‌గా సంచలనం సృష్టించింది.

ఈ సినిమాలో అమితాబ్ ఒక సీరియస్ పోలీస్ ఆఫీస్ ఇన్స్పెక్టర్ విజయ్ ఖన్నా పాత్రలో కనిపించారు. అమితాబ్ బచ్చన్ కంటే ముందు ఈ సినిమాను ధర్మేంద్ర, రాజేష్ ఖన్నా, దేవ్ ఆనంద్, రాజ్ కుమార్ వంటి ప్రముఖ నటులకు వినిపించారు. వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాను వదులుకున్నారు. హీరోలే కాదు హీరోయిన్లు కూడా చాలా అయిష్టంగా కనిపించారు. చివరకు జయ భాదురిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ప్రముఖ నటుడు ప్రాణ్ సహాయ పాత్రలో నటించాడు. ఈ సినిమా తర్వాత అమితాబ్ లక్ మారిపోయింది. ఈ సూపర్ హిట్ సినిమా తర్వాత ‘షోలే’, ‘త్రిశూల్’ వంటి బంఫర్ ఆఫర్స్ వచ్చాయి. అమితాజ్ ఓ సూపర్ స్టార్ అయ్యాడు. ఈ సినిమా IMDbలో 10కి 7.5 రేటింగ్ పొందింది. ఈ సినిమాను OTTలో చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూడొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *