ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో టీం ఇండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో పాత రికార్డులను పాతరేశారు. 46 సంవత్సరాల తర్వాత భారత బ్యాట్స్ మెన్ ఒకే సిరీస్ లో అత్యధిక సెంచరీలు సాధించారు.
లీడ్స్‌లోని హెడింగ్లీలో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలు సాధించగా.. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలు సాధించారు.
బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో శుభ్‌మాన్ గిల్ (269) డబుల్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగులు చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. అదేవిధంగా లండన్‌లోని లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా తరఫున కెఎల్ రాహుల్ (100) సెంచరీ సాధించాడు.
అదేవిధంగా, మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్ట్ మ్యాచ్‌లో, శుభ్‌మన్ గిల్ (103), రవీంద్ర జడేజా (107), వాషింగ్టన్ సుందర్ (101) సెంచరీలు సాధించారు. ఇప్పుడు, కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన ఐదవ టెస్ట్‌లో, యశస్వి జైస్వాల్ (118) సెంచరీ సాధించాడు. ఈ సెంచరీలతో, భారత బ్యాట్స్‌మెన్ కొత్త చరిత్ర సృష్టించారు.
1978-79లో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో, టీం ఇండియా బ్యాట్స్‌మెన్ మొత్తం 11 సెంచరీలు సాధించి రికార్డు సృష్టించారు. ఇప్పుడు, 5 మ్యాచ్‌ల ద్వారా, భారత యువ బ్యాట్స్‌మెన్ మొత్తం 12 సెంచరీలు సాధించారు. అలా చేయడం ద్వారా, వారు 46 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టారు. అలాగే, 93 ఏళ్ల టెస్ట్ చరిత్రలో వారు ఒక సిరీస్‌లో 12 సెంచరీలు సాధించడం ఇదే తొలిసారి.