22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే

22 ఏళ్లకే బీపీ 300.. నరాలు చిట్లి మృతి.. కారణం ఇదే


22 ఏళ్ల మహ్మద్ కైఫ్ ఉత్తరప్రదేశ్ లోని మీరట్‎లో ఉంటాడు. ఎంతో యాక్టివ్ చురుగ్గా ఉంటాడు. ఎంత యాక్టివ్ అంటే సెల్ ఫోన్ పట్టుకున్నాడంటే PUB G గేమ్ ఇట్టే ఆడేస్తాడు. గెలిచే వరకు ఫోన్ వదలడు. అలాంటి కుర్రోడికి బీపీ బ్లడ్ ప్రెజర్ 300 వచ్చింది. హై బీపీతో నరాలు చిట్లిపోయాయి. ఆ తర్వాత చనిపోయాడు కారణం సెల్ ఫోన్‎లో పబ్జీ ఆడటమే. మొన్నటికి మొన్న యూపీలో ముగ్గురు అక్కా చెళ్లళ్లు కొరియన్ గేమ్ ఆడుతూ.. కొరియన్‎లా మారాలనే ఆలోచన నెరవేరకపోవటంతో.. ఆత్మహత్య ఘటన మర్చిపోక ముందే.. మీరట్‎లో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. మీరట్‌లో 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ పబ్జీ గేమ్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో మృతి చెందాడు. పబ్జీ గేమ్ ఒత్తిడితో బీపీ ఆకస్మాత్తుగా పెరిగి రక్త నాళాలు చిట్లిపోయి కైఫ్ మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కైఫ్ తండ్రి ఫరూఖ్ మాట్లాడుతూ.. తన కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు బీపీ 300 కంటే ఎక్కువగా ఉందని చెప్పారు. తీవ్ర ఒత్తిడితో బీపీ పెరిగి మెదడులో రక్తస్రావమై మెడ నరాలు చిట్లిపోవడం వల్లే మరణించాడని అన్నారు. కైఫ్ గత పది సంవత్సరాల నుంచి హై బీపీతో బాధపడుతున్నాడని. పబ్జీ గేమ్ ఒత్తిడితో బీపీ మరింత పెరిగి చివరకు ప్రాణాలు కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పబ్జీ గేమ్ ఒత్తిడికి 22 ఏళ్ల యువకుడు బలి కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లీజ్.. మా దేశానికి రాకండి మహాప్రభో !

మద్యం లేకుండా పెళ్లి జరిపిస్తే రూ.51 వేలు గిఫ్ట్

స్టైల్ గా ఉరేసుకుంటూ రీల్ చేసిన మహిళ.. కట్ చేస్తే సీన్ రివర్స్

రాజమౌళి.. నీ చర్యలు ఊహాతీతం స్వామి.. ఇది కేవలం నీ ఒక్కడికే సాధ్యం

Gold Price Today: ఫ్లాష్ మాన్ లా పైపైకి పెరుగుతున్న బంగారం,వెండి ధరలు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *