2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..

2027 సంక్రాంతికి ఆ నలుగురు.. వాళ్లకు చుక్కలే ఇక..


2027 సంక్రాంతికి నలుగురు సీనియర్లు వస్తారనే టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. చిరు, వెంకీ, బాలయ్య, నాగార్జున వస్తే మంచిదే.. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. కానీ ఆ నలుగురు రేసులో దిగితే వచ్చే లాభాల కంటే నష్టాలే బాగా ఎక్కువగా ఉన్నాయి. ఒకేసారి నలుగురు రంగంలోకి దిగితే బాక్సాఫీస్‌కు ఏమంత మంచిది కాదు. అదెలాగో డీటైల్డ్‌గా చూద్దామా..? సీనియర్ హీరోలకు సంక్రాంతి అలవాటుగా మారిపోయింది. చిరంజీవి, వెంకటేష్, బాలయ్య, నాగార్జునలలో కనీసం ఇద్దరైనా ప్రతీ సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారు. మొన్న పండక్కి చిరు, వెంకీ కలిసే వచ్చారు. ఈ సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ.. 2027 సంక్రాంతికి ఏకంగా నలుగురూ వచ్చేలా కనిపిస్తున్నారు. అదే జరిగితే బాక్సాఫీస్‌కు పూనకాలు ఖాయం. వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే సంక్రాంతికి ఫైనల్ అయిపోయింది.. వాసివాడి తస్సాదియ్యా అంటూ నాగ్ కూడా పొంగల్ బెర్త్ లాక్ చేసుకోవడమే కాదు జనవరి 15 అంటూ డేట్ కన్ఫర్మ్ చేసారు. ఇక బాలయ్య, గోపీచంద్ మలినేని.. చిరు, బాబీ సినిమాలు కూడా పండగనే టార్గెట్ చేస్తున్నాయి. మూడేళ్ల కింద వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డితో పండక్కి పోటీ పడ్డారు చిరు, బాలయ్య. పండక్కి నలుగురు సీనియర్లు వస్తారనే ఆలోచన బాగానే ఉంది కానీ అలా వస్తే మాత్రం నష్టాలే ఎక్కువ. ఫ్యాన్ వార్స్ మళ్లీ చెలరేగుతాయి. ఇద్దరొస్తేనే మా హీరో గొప్పంటే కాదు మా వాడే గొప్ప అంటూ సోషల్ మీడియాలో హీట్ పెరిగిపోయింది. అలాంటిది నలుగురూ వస్తే రచ్చ రచ్చే. థియేటర్స్ దగ్గర కూడా దండయాత్ర తప్పదు.. చాలా కాంప్రమైజులు కావాల్సి ఉంటుంది. నలుగురు సీనియర్లు పండక్కి వస్తే.. చిన్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. ఆల్రెడీ శర్వానంద్, శ్రీను వైట్లతో పాటు.. తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలు పండగనే టార్గెట్ చేసాయి. ఈ టైంలో నలుగురు రంగంలోకి దిగితే.. మిగిలిన అందరికీ చుక్కలే. మరి చూడాలిక.. సంక్రాంతికి ఇంకా 11 నెలలు టైమ్ ఉంది.. ఆలోపు ఎవరు బరిలో ఉంటారో.. ఎవరు బయటికెళ్తారో..?

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Jr NTR: ఎన్టీఆర్‌పై వార్ 2 ఎఫెక్ట్.. ఆ మాత్రం ఉంటుందిలే

Musi River: మూసీ పునరుజ్జీవానికి తొలి అడుగు

Gold & Silver Price: తగ్గిన బంగారం వెండి ధరలు.. ఎంతంటే ??

Raashii Khanna: సినిమా ఛాన్స్ లేకపోతే ఏంటి.. నాకు సోషల్ మీడియా ఉందిగా అంటున్న రాశీ ఖన్నా

గోల్డెన్ ఛాన్స్.. చేతులారా నాశనం చేసుకున్నారుగా



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *