మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)లో తొలి సెంచరీ ఎట్టకేలకు నమోదైంది. డబ్ల్యూపీఎల్ 4వ సీజన్లో ముంబై ఇండియన్స్ దిగ్గజ ఆల్ రౌండర్ నాట్ స్కైవర్ బ్రంట్ సెంచరీ సాధించి చరిత్ర సృష్టించింది. డబ్ల్యూపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన కీలకమైన మ్యాచ్లో నాట్ స్కైవర్ బ్రంట్ కేవలం 57 బంతుల్లో సెంచరీ సాధించి, డబ్ల్యూపీఎల్ రికార్డులలో తన పేరును శాశ్వతంగా నిలిపింది. వరుసగా 4 సీజన్లలో, చాలా మంది బ్యాటర్లు 90ల్లో బలైపోతూనే ఉన్నారు. దీని కారణంగా తొలి సెంచరీ కోసం ఎదురుచూపులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, 1059 రోజులు, 82 మ్యాచ్ల తర్వాత డబ్ల్యూపీఎల్ లో చివరకు తన తొలి సెంచరీని సాధించింది.