హైదరాబాద్‌లో భారీ విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర పన్నినట్లు సమాచారం అందడం కలకలం రేపింది. ఉగ్ర కుట్రలకు హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైల్లో ప్రణాళికలు రచించినట్లు నిఘావర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. జైలు ములాఖత్‌లో ఉగ్రకుట్ర జరిగిందన్న నిఘావర్గాలు.. లష్కరే తోయిబా ఉగ్రవాది జైల్లో కుట్ర చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ములాఖత్‌లో ఉగ్రదాడులపై చర్చించినట్టు సమాచారం.. వరుస పేలుళ్ల కుట్రకేసులో ఇప్పటికే చంచల్‌గూడ జైల్లో ముగ్గురు ఉగ్రవాదులు ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒక ఉగ్రవాది భార్య ద్వారా.. ఉగ్రకుట్రపై సమాచారం ఇచ్చిపుచ్చుకున్నారని నిఘావర్గాలు పేర్కొంటున్నాయి.. ఈ పరిణామాలతో ముసారాంబాగ్, సైదాబాద్, మలక్‌పేట్‌లో పోలీసుల నిఘా ఉంచారు. అంతేకాకుండా.. హైదరాబాద్ నగరం వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.