స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. మీ డబ్బు పెరగాలంటే ఎందులో పెట్టుబడి పెట్టాలి?

స్టాక్ మార్కెట్ vs రియల్ ఎస్టేట్.. మీ డబ్బు పెరగాలంటే ఎందులో పెట్టుబడి పెట్టాలి?


పెట్టుబడి పెట్టాలనుకునే వారికి స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రెండింటిలో ఎందులో ఇన్వెస్ట్‌ చేయాలనే ఒక డౌట్‌ ఉంటుంది. అధిక లాభాల కోసం ప్రయత్నించాలా? లేక స్థిరమైన ఆస్తిని ఎంపిక చేసుకోవాలా? అనే సందేహం చాలా మందిలో కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే, ఈ రెండు రంగాలకు తమ తమ ప్రత్యేక ప్రయోజనాలు, ప్రమాదాలు ఉన్నాయి.

స్టాక్ మార్కెట్ విషయానికి వస్తే.. దీర్ఘకాలంలో సంపద సృష్టికి ఇది వేగవంతమైన మార్గంగా నిపుణులు పేర్కొంటున్నారు. మంచి కంపెనీల షేర్లలో లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడితే సంవత్సరానికి సగటున 12 నుంచి 15 శాతం లేదా అంతకంటే ఎక్కువ రాబడి పొందే అవకాశముంది. ముఖ్యంగా తక్కువ మొత్తంతోనే పెట్టుబడి ప్రారంభించగలగడం, అవసరమైనప్పుడు షేర్లను సులభంగా అమ్ముకోవచ్చు అన్న లిక్విడిటీ వంటి అంశాలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే మార్కెట్ అస్థిరత ఎక్కువగా ఉండటం వల్ల తక్కువ కాలంలో నష్టాలు కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది.

ఇక రియల్ ఎస్టేట్ రంగం స్థిరత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. భూమి లేదా ఇల్లు కొనుగోలు చేస్తే అద్దె రూపంలో నెలవారీ ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో పాటు, దీర్ఘకాలంలో ఆస్తి విలువ పెరిగే అవకాశమూ ఉంటుంది. కానీ ఇందులో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో మూలధనం అవసరం. అలాగే అవసరమైనప్పుడు ఆస్తిని వెంటనే అమ్ముకోవడం కష్టమవడం, నిర్వహణ ఖర్చులు ఉండటం వంటి సవాళ్లు ఉన్నాయి.

ప్రస్తుతం కొన్ని నగరాల్లో రియల్ ఎస్టేట్ ధరలు పెరుగుతుండగా, స్టాక్ మార్కెట్‌లో విలువలు కొంత ఎత్తులో ఉన్నాయని విశ్లేషకులు సూచిస్తున్నారు. అందువల్ల ఒక్క రంగంపై పూర్తిగా ఆధారపడకుండా, పెట్టుబడిని రెండు మార్గాల్లో విభజించడం సురక్షిత వ్యూహంగా నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *