మొన్నటి వరకు సైయారా, ఇప్పుడు మహావతార్ నరసింహా సినిమా పేర్లు బాక్సాఫీస్ దగ్గర మారుమోగుతున్నాయి. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా.. భారీ బడ్జెట్ కానీ చిత్రాలు ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతున్నాయి. అద్భుతమైన వసూళ్లతో సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తున్నాయి. కానీ మీకు తెలుసా.. సైయారా, మహావతార్ నరసింహా కాదు.. బాక్సాఫీస్ విన్నర్‌గా నిలిచిన సినిమా గురించి తెలుసా..? ఆడంబరమైన ప్రమోషన్లు లేదా స్టార్-స్టడెడ్ ప్రీమియర్లు లేకుండా కేవలం పాజిటివ్ మౌత్ టాక్ అందుకుని మంచి వసూల్లు రాబట్టింది. ఈ సినిమాకు ప్రేక్షకులు నవ్వుతూ, కనెక్ట్ అవుతున్నారు. అదే జె.పి. తుమినాద్ దర్శకత్వం వహించిన ‘సు ఫ్రమ్ సో’ సినిమా. కన్నడ భాషలో సూపర్ నాచురల్ కామెడీ సినిమా 2025లో భారీ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి: Cinema: ఇదెక్కడి సినిమా రా బాబు.. రూ.16 కోట్లు పెడితే 400 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ ఆగం చేసిన మూవీ..
కేవలం రూ. 4 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్స్ బద్దలు కొట్టింది. సైయారా, మహావతార్ నరసింహ వంటి భారీ బడ్జెట్ సినిమాల కంటే కూడా కమర్షియల్ హిట్ అయిన సినిమా ఇది. ఈ మూవీ మొదటి రోజు రూ. 1 కోటి వసూళ్లు రాబట్టింది. తొలి మూడు రోజుల్లోనే రూ.7 కోట్లు వసూలు చేసింది. ఇక పది రోజుల్లో రూ.36 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లు దాటింది. ఈ చిత్రం దాదాపు 700% పెట్టుబడిపై రాబడితో 2025లో అత్యంత లాభదాయకమైన భారతీయ చిత్రంగా నిలిచింది.
ఇవి కూడా చదవండి
ఇవి కూడా చదవండి: Ajith Kumar: అజిత్ పక్కన ఉన్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా.. ? పాన్ ఇండియా హీరో కమ్ విలన్.. ఎవరంటే..
కర్ణాటక తీరప్రాంత గ్రామంలో జరిగే ఒక విచిత్రమైన అతీంద్రియ కామెడీ సినిమా. సులోచన అనే స్త్రీ ఆత్మ తనను ఆవహించిందని.. ఆ తర్వాత అోశక అనే వ్యక్తి జీవితం ఎలా తలకిందులు తిరిగింది అనేది సినిమా. ఆద్యంతం కామెడీతో ప్రేక్షకులను నవ్విస్తుంది. మూఢనమ్మకం, సమాజాన్ని సరదాగా, ఊహించని మలుపులు తిరుగుతుంది. 9.0 IMDb రేటింగ్‌ను పొందింది.
ఇవి కూడా చదవండి: Actress : బాబోయ్.. సీరియల్లో తల్లి పాత్రలు.. నెట్టింట గ్లామర్ రచ్చ.. సెగలు పుట్టిస్తోన్న వయ్యారి..