సూర్య గ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెలుగులు తెస్తోంది.. మీ రాశి ఉందా..?

సూర్య గ్రహణం.. ఈ రాశులవారి జీవితాల్లో సరికొత్త వెలుగులు తెస్తోంది.. మీ రాశి ఉందా..?


హిందూ మతం, జ్యోతిష్య శాస్త్రంలో సూర్య, చంద్ర గ్రహణాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. గ్రహణాల సందర్భంగా ప్రముఖ ఆలయాలను మూసివేస్తారు. గ్రహణాల సమయంలో ఆచరించాల్సిన నియమాలు కూడా ఉన్నాయి. వాటిని తప్పక ఆచరించాలని పండితులు చెబుతుంటారు. ఇక, జ్యోతిషశాస్త్రంలో గ్రహణాలను సాధారణంగా అశుభ సంకేతాలుగా పరిగణించినప్పటికీ.. గ్రహాల ప్రత్యేక స్థానాల కారణంగా కొన్ని రాశులకు అవి శుభఫలితాలను కూడా అందించగలవు. ప్రస్తుతం సూర్యుడు.. శని అధిపత్యంలోని కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు, చంద్రుడు, శుక్రుడు కూడా ఇదే రాశిలో ఉండటం వల్ల ఈ సూర్యగ్రహణ ప్రభావం కొన్ని రాశిచక్రాలకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి శుభఫలితాలు కనిపించవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారికి సూర్యుడు 11వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఐదవ స్థానాధిపతి అయిన సూర్యుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయం, లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. సంతానం, విద్య, గౌరవానికి సంబంధించిన అంశాల్లో మంచి పురోగతి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు లేదా గుర్తింపు లభించవచ్చు. కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు.

వృషభ రాశి

వృషభ రాశి వారికి విజయ ద్వారాలు తెరుచుకునే సమయం ఇది. ఉద్యోగ సంబంధిత ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థికంగా గణనీయమైన లాభాలు పొందే అవకాశం ఉంది.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ కాలం శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగస్తులు విలువైన సమాచారం లేదా కొత్త బాధ్యతలు పొందవచ్చు. వ్యాపారవేత్తలు ముఖ్యమైన ఒప్పందాలు సాధించవచ్చు. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా అభివృద్ధి చెందే మార్గాలు తెరుచుకుంటాయి.

మీన రాశి

మీన రాశి వారికి అనుకూల సమయం ప్రారంభమవుతుంది. వ్యాపారంలో స్థిరమైన పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. బాకీ ఉన్న డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. ఉద్యోగంలో పదోన్నతి, జీతం పెరుగుదల లభించవచ్చు. గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. జీవితంలో కొత్త మార్గాలు దర్శనమిస్తాయి.
మొత్తానికి, ఈ సూర్యగ్రహణం కొన్ని రాశుల వారికి ఆశాజనకమైన మార్పులను తీసుకురావచ్చు. అయితే వ్యక్తిగత జాతక పరిస్థితుల ఆధారంగా ఫలితాలు మారవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *