సీసీటీవీలో భార్యాభర్తల అరుపులు..ఆ మరునాడే .. ఏం జరిగిందంటే వీడియో

సీసీటీవీలో భార్యాభర్తల అరుపులు..ఆ మరునాడే .. ఏం జరిగిందంటే వీడియో


రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం జరిగింది. ఒక దంపతుల జంట వారి ఇంట్లో చనిపోయి కనిపించారు. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు ఈ జంట ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు. అలాగే అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ప్రారంభించారు. జైపూర్‌లోని ఒక బ్యాంకులో సేల్స్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న ధర్మేంద్ర సమయం గడుస్తున్నా బ్యాంకుకు రాకపోవడంతో, సిబ్బంది అతనికి కాల్‌ చేశారు. దానికి కూడా సమాధానం రాకపోవడంతో ధర్మేంద్ర స్నేహితుడు అతని ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ధర్మేంద్రతో పాటు అతని భార్య విగతజీవులుగా కనిపించారు. కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారి ఫ్లాట్ పార్కింగ్ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, దానిలో ధర్మేంద్ర, సుమన్‌ ఇద్దరూ ఏదో విషయమై తీవ్ర స్థాయిలో అరుచుకుంటూ, వాదించుకోవడం కనిపించింది. ఈ ఫుటేజ్ దంపతులు మృతిచెందడానికి ముందు రోజుదిగా పోలీసులు గుర్తించారు. అలాగే ఆ వీడియోలో సుమన్ తన భర్త కారు స్టార్ట్ చేయడాన్ని అడ్డుకుంటున్నట్లు కనిపించింది. ఆ తరువాత వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం వారు లిఫ్ట్ ఎక్కి తమ ఇంటిలోకి వెళ్లిపోయారు.

మరిన్ని వీడియోల కోసం :

రోజుకు 360 సార్లు వాంతులు.. ఎందుకో తెలిస్తే షాక్‌! వీడియో

కోతుల బీభత్సం.. స్కూలుకు వెళ్తున్న విద్యార్ధినిపై వీడియో

‘వామ్మో.. వాడు పెద్ద సైకో’వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *