చూస్తుండగానే ఒక్కో నెల హౌజ్ ఫుల్ అయిపోతుంది. ఆగస్టు నెలలో క్రేజీ సినిమాలు క్యూ కడుతున్నాయి. అందులో కొన్ని పాన్ ఇండియా అయితే.. మరికొన్ని మన సినిమాలు. మొత్తానికైతే ఆగస్ట్ హౌజ్ ఫుల్ అయిపోయింది. మరి ఈ నెలలో రాబోయే సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం
ఆగస్ట్ అంతా సినిమా సందడి కనిపించబోతుంది. ముఖ్యంగా ప్యాన్ ఇండియన్ సినిమాలు కూడా బాగానే సందడి చేయబోతున్నాయి. ఆగస్ట్ 1న సర్ మేడమ్ అనే డబ్బింగ్ సినిమాతో జర్నీ మొదలైన జర్నీ.. ఆ తర్వాత 8న బకాసుర రెస్టారెంట్ అనే మరో చిన్న సినిమా కూడా రానుంది. కానీ అసలు సినిమా ఆగస్ట్ 14న షురూ కానుంది. అప్పుడే కూలీ, వార్ 2 రానున్నాయి.
ఆగస్ట్ 15 వీకెండ్ ఈసారి భారీగా ఉండబోతుంది. ఓవైపు రజినీకాంత్ కూలీ.. మరోవైపు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ వార్ 2 సినిమాలు ఒకేరోజు రానున్నాయి. ఈ రెండింటిపై అంచనాలు భారీగా ఉన్నాయి.. మార్కెట్ పరంగానూ రెండు ఢీ అంటే ఢీ అంటున్నాయి. హిందీ, తెలుగులో తారక్ ఎడ్జ్ తీసుకుంటే.. సౌత్ అంతా కూలీ అండర్ కంట్రోల్లోనే ఉంది.
ఆగస్ట్ 22న చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే అనుపమ పరమేశ్వరన్ నటిస్తున్న పరదా సినిమా ఆ రోజే విడుదల కానుంది.. ఇక అదేరోజు మేఘాలు చెప్పిన ప్రేమకథ అనే మరో సినిమా కూడా రానుంది. ఆగస్ట్ 27న వినాయక చవితి వీకెండ్‌కు మాస్ జాతర చూపించడానికి రెడీ అవుతున్నారు రవితేజ.
రవితేజ వస్తున్నాడని తెలిసినా కూడా.. అదేరోజు నారా రోహిత్ సుందరాకాండ విడుదల కానుంది. తాజాగా ఈ డేట్ కన్ఫర్మ్ చేసారు మేకర్స్. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తుంది సుందరాకాండ. మరోవైపు ఘాటీ సైతం అన్నీ కుదిర్తే ఆగస్ట్‌లో రానుంది. మొత్తానికి ఆగస్ట్ అంతా చిన్నా పెద్దా సినిమాలతో నిండిపోయింది.