భారత్ గౌరవ్ పేరుతో ఇండియన్ రైల్వేస్ ప్రత్యేక పర్యాటక రైలును ప్రారంభించింది. ఆగస్టు 16 నుంచి ‘భారత్ గౌరవ్’ ప్రత్యేక పర్యాటక రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలులో పంచ జ్యోతిర్లింగ దర్శన యాత్ర (8 రాత్రులు / 9 రోజులు) చేయవచ్చు. మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, త్రయంబకేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్లను కలుపుతూ ఈ యాత్ర సాగుతోంది.
రైలు బయలుదేరు సమయం.. మధ్యాహ్నం 2:00 గంటలకు సికింద్రాబాద్ నుంచి, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణా మీదుగ ఉజ్జయినికి ప్రయాణం కొనసాగుతుంది. టికెట్ ధరలు ఇలా ఉన్నాయి.. స్లీపర్ రూ.14,700, 3 AC రూ.22,900, 2 AC రూ.29,900లుగా ఉన్నాయి. ప్యాకేజీలో రోజుకు మూడు భోజనాలు, వసతి, పర్యాటక రవాణా సౌకర్యాలు, ప్రతి బోగీలో IRCTC సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఈ ప్రత్యేక రైలు గురించి మరింత సమాచారం కోసం అధికారిక వెబ్సైట్, ఫోన్ నంబర్లు: 97013 60701, 92810 30740, 92810 30750, 92810 30711 సంప్రదించవచ్చు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి