సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌

సింహస్వప్నంగా కోస్ట్‌గార్డ్‌.. చమురు స్మగ్లింగ్‌కు చెక్‌


ముంబై తీరంలో అక్రమంగా చమురు రవాణా చేస్తున్న స్మగ్లర్ల నౌకలపై భారత కోస్ట్ గార్డ్ మెరుపు దాడి చేసింది. మూడు భారీ చమురు ట్యాంకర్లను సీజ్‌ చేసింది. ఈ నౌకలకు ఇరాన్‌తో సంబంధాలున్నాయి. ఈ నౌకలపై అమెరికా ఆంక్షలున్నాయి. నడిసంద్రంలో చమురును ఒక ఓడ నుంచి మరో ఓడకు అక్రమంగా మారుస్తూ ఇవి పట్టుబడ్డాయి. దౌత్యపరంగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై తీరానికి వంద నాటికల్ మైళ్ల దూరంలో అనుమానాస్పద కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. మూడు భారీ నౌకలు అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నాయి. నడిసంద్రంలో చమురును ఒక ఓడ నుంచి మరో ఓడకు అక్రమంగా మార్చడం మన కోస్ట్‌గార్డ్‌ కంటపడింది. ఇటీవల రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించడానికి భారత్ అంగీకరించడంతో.. భారతీయ వస్తువులపై ఉన్న దిగుమతి సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. ఇప్పుడు అమెరికా ఆంక్షలు విధించిన మూడు ఇరాన్‌ నౌకలను భారత్ పట్టుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం నౌకలను సీజ్ చేయడమే కాకుండా సముద్ర గర్భంలో జరుగుతున్న భారీ చమురు మాఫియా నెట్‌వర్క్‌ను భారత్ ఛేదించింది. భారత్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఇతర దేశాలు మద్దతు తెలిపాయి. చమురు అక్రమ తరలింపును పూర్తిగా అడ్డుకోవడం కోసం భారత కోస్ట్ గార్డ్ సముద్రజలాల్లో తన నిఘాను మరింత పెంచింది. భారత తీరం వెంబడి ప్రయాణం అంటే స్మగ్లర్లు వణికిపోయేలా చేస్తోంది. ప్రస్తుతం 55 యుద్ధ నౌకలు ప్రాదేశిక జలాల్లో పహారా కాస్తున్నాయి. డిస్కౌంట్ ధరలకు లభించే చమురును దొడ్డిదారిన తరలించే వారి ఆటలు ఇక సాగవని భారత అధికారులు హెచ్చరించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బద్ధలైన అగ్నిపర్వతం.. 1300 అడుగుల ఎత్తుకు ఎగసిపడ్డ లావా

Intermittent Fasting: ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంతా ఉత్తిదేనా ? సైన్స్ చెప్పిన చేదు నిజం ఇదే

సముద్రంపై కాంతులీనుతూ యుద్ధ నౌకల కనువిందు

Gold Price Today: స్థిరంగా బంగారం ధర.. ఇవాళ ఎంతంటే ??

Pratyusha Case: నటి ప్రత్యూష మృతి కేసు.. సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి.. సుప్రీంకోర్టు తీర్పు



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *