సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో ప్రపంచాన్ని తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ..! అసలేమిటిది?

సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో ప్రపంచాన్ని తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ..! అసలేమిటిది?


సాదాసీదా స్నానం కాదు ఇది.. 2026లో ప్రపంచాన్ని తెగ ఊపేస్తున్న ఆఫ్గస్ థెరపీ..! అసలేమిటిది?

ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగే కొద్దీ కొత్త కొత్త వెల్నెస్ ట్రెండ్స్ పుట్టుకొస్తున్నాయి. ఇప్పటి వరకు మనం యోగా, జిమ్, స్పా గురించి విన్నాం. కానీ 2026లో ప్రపంచవ్యాప్తంగా ఒక వింతైన, వినూత్నమైన థెరపీ హాట్ టాపిక్‌గా మారింది. అదే ఆఫ్గస్ షవర్. జర్మనీ నుంచి పుట్టుకొచ్చిన ఈ ప్రాచీన పద్ధతి ఇప్పుడు గ్లోబల్ వెల్నెస్ మార్కెట్‌ను శాసిస్తోంది. అసలు ఈ ఆఫ్గస్ అంటే ఏంటి? దీనివల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.. సాధారణంగా సౌనా అంటే ఒక మూసి ఉన్న గదిలో వేడి ఆవిరి పట్టించుకోవడం అని మనకు తెలుసు. కానీ ఆఫ్గస్ అనేది ఒక అద్భుతమైన కళ. జర్మన్ భాషలో ఆఫ్గస్ అంటే కషాయం పోయడం లేదా ఇన్ఫ్యూషన్ అని అర్థం. ఇందులో ఒక నిపుణుడు వేడి రాళ్లపై సుగంధ తైలాలు కలిపిన మంచు ముక్కలను లేదా నీటిని పోస్తారు.

సౌనా మాస్టర్ మ్యాజిక్!

ఈ థెరపీలో కేవలం ఆవిరి మాత్రమే ఉండదు. సౌనా మాస్టర్ ఒక టవల్ లేదా ఫ్యాన్ ఉపయోగించి ఆ ఆవిరిని గదిలో ఉన్నవారందరికీ తాకేలా లయబద్ధంగా ఊపుతారు. దీనిని ఒక ప్రదర్శనలా నిర్వహిస్తారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మ్యూజిక్, లైటింగ్, సుగంధ పరిమళాల మధ్య జరిగే ఈ ప్రక్రియ మైమరిపిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Therme Erding (@thermeerding)

ఆఫ్గస్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

  • డీటాక్సిఫికేషన్: విపరీతమైన చెమట పట్టడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
  • స్ట్రెస్ రిలీఫ్: మ్యూజిక్ మరియు సుగంధ తైలాల ప్రభావంతో మానసిక ఒత్తిడి మటుమాయమవుతుంది.
  • మెరుగైన రక్త ప్రసరణ: వేడి ఆవిరి వల్ల రక్త నాళాలు వ్యాకోచించి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.
  • రోగ నిరోధక శక్తి: క్రమం తప్పకుండా ఈ థెరపీ తీసుకోవడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

భారత్‌లోనూ క్రేజ్ మొదలైందా?

యూరప్ దేశాల్లో ఇప్పటికే విపరీతమైన క్రేజ్ ఉన్న ఈ ఆఫ్గస్ థెరపీ.. ఇప్పుడు మెల్లగా మెట్రో నగరాలైన ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లోని లగ్జరీ స్పా సెంటర్లలోకి ప్రవేశిస్తోంది. 2026 చివరి నాటికి ఇది అత్యంత ఖరీదైన మరియు పాపులర్ వెల్నెస్ ట్రెండ్‌గా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *