అపార కాకతీయ సేన ధాటికి తట్టుకోలేక మేడ రాజ,పగిడి గిద్దరాజు,సారక్క,నాగులమ్మ,గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. జంపన్న కు తీవ్ర గాయాలయ్యాయి. తరువాత సంపెంగ వాగులో శవమై తేలాడు. .అప్పటి నుంచి సంపెంగ వాగు జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది. ఇక సమ్మక యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి వీరోచితంగా పోరాటం సాగించింది. గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్రుడు అశ్వర్య చకితుడయ్యాడు. సమ్మక్క రక్తపు దారాల తోనే చిలుకల గుట్ట వైపువెళ్తూ మార్గమధ్యంలోనే అదృశమవుతుంది.