సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..

సముద్రంలో సరదా విహారం.. ప్రాణాల మీదికొచ్చింది..


సముద్ర తీరానికి వెళ్లినపుడు బోటింగ్‌కి వెళ్లడం సర్వ సాధారణం. కాలిఫోర్నియాలోని సముద్రంలో సరదాగా స్పీడ్‌ బోట్‌లో విహరించేందుకు వెళ్లిన ఓ కుటుంబం ఊహించని ప్రమాదానికి గురైంది. భార్యాభర్తలు, నలుగురు పిల్లలు రైడ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. పడవ స్పీడ్‌గా ఒడ్డు వైపుకు కదులుతోంది. అంతలో 15 అడుగుల రాకాసి అలలు విరుచుకుపడటంతో అంతా షాకయ్యారు. బోట్ వేగం పెంచినప్పటికి అంతకంటే వేగంగా అలలు వారిని ముంచెత్తాయి. స్టీరింగ్‌ పక్కకు తిరగలేదు దీంతో నేరుగా అలల మధ్యకు బోటును దూసుకుంటూ వెళ్లింది. అలల ధాటికి పడవ పల్టీ కొట్టి తిరగబడింది. చిన్న పిల్లల సహా కుటుంబమంతా నీటిలో మునిగి పోయారు. ఆ సమయంలో అక్కడ వీడియో తీస్తున్న surferలకు బోటు ఒక వైపు పిల్లలు మరో వైపు అలలపై తేలియాడుతూ కనిపించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న surfing champion డేరిల్‌ విరోస్ట్‌కో తన బృందంతో రంగంలోకి దిగారు. ఐదుగురు సర్ఫర్లు ఒక బృందంగా తక్షణం స్పందించారు. ప్రముఖ surfing spot steamers వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ధైర్యం చేసి ఆ ప్రాంతానికి చేరుకుని నీటిపై తేలుతున్న వారిని కాపాడారు. సర్పర్లు ఆ సమయంలో సకాలంలో స్పందించి ధైర్యంగా ముందుకురాకపోతే సముద్రం ఉదృతిలో కుటుంబమంతా కొట్టుకుపోయేవారు. సాహసంతో వారిని కాపాడిన శాంటా క్రూజ్‌ surferలు డేరిల్, 14 ఏళ్ల ఇయాన్ ఆండర్సన్ ఇంకా ముగ్గురి పై అంతా అభినందనలు కురిపించారు. ప్రమాదంలో 3 ఇంకా 9 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు సురక్షితంగా బయటపడటం ఆనందంగా ఉందని ప్రధాన surfer డేరిల్‌ విరోస్ట్‌కో అన్నారు. ఆరుగురిని విజయవంతంగా రక్షించిన surfing కమ్యూనిటీని స్థానిక యంత్రాంగం అభినందించింది. బిగ్ వేవ్ సర్ఫర్ డారిల్ ‘ఫ్లీ’ విరోస్ట్కో మాట్లాడుతూ నమ్మలేకపోతున్నా.. కానీ చిన్న పిల్లలతో సహా అందరూ ఈ పడవ ప్రమాదం నుండి బయటపడ్డారంటూ ఆనందాన్ని ప్రకటించారు. మరోవైపు బోటింగ్‌ సమయంలో లైఫ్‌ జాకెట్లు ధరించడం తప్పనిసరి. ఈ ప్రమాదంలో భార్య భర్తల జంట లైఫ్‌ జాకెట్లను ధరించలేదని తెలుస్తోంది. ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prabhas: దెబ్బ మీద దెబ్బకు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభాస్‌

కోటిన్నరకు భర్తను అమ్మేసిన భార్య.. కారణం ఇదే !! మహానుభావురాలు

‘నన్ను ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదు’ స్టార్ హీరోయిన్ ఆవేదన

Rajinikanth: మిత్రుడైనా.. రెమ్యునరేషన్లో నో కాంప్రమైజ్‌ గురూ..!

Nagarjuna: ‘ధురంధర్’లో విలర్‌ ఛాన్స్ మిస్‌ !! నాగార్జున రియాక్షన్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *