ఈ ఘటన ఏ పుణ్యక్షేత్రంలో జరిగిందనే వివరాలు తెలియకున్నా.. అక్కడి ఘటన తాలూకూ వీడియో నెట్టింట వైరల్ అవుతూ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పెద్ద శివుని విగ్రహం ఉంది. ఎక్కడినుంచి వచ్చిందో కానీ ఓ నాగుపాము నేరుగా శివుని విగ్రహం మీదకు పాకి..‘ఇదీ నా స్థానం’ అన్నట్లుగా ఆయన మెడలో హారంలా చుట్టుకొని దర్శనమిచ్చింది.శ్రావణ మాసంలో ఇలాంటి సంఘటన జరగటంతో భక్తులు ఆశ్చర్యపోతున్నారు. చూసినందుకు తమ జన్మ ధన్యమైందంటున్నారు. మరికొందరు దీనిని ఎప్పటికీ మరచిపోలేని దృశ్యం అని పేర్కొన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో లైకుల, షేర్లు కూడా పెద్ద సంఖ్యలో వచ్చాయి..ఆరు లక్షలకు పైగా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేశారు. వేలాది మంది తమ అభిప్రాయాలను తెలియజేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
3 కళ్లజోడు గుర్తులతో అరుదైన నాగుపామును చూశారా?
Saudi Arabia: సౌదీలో ఆ పని చేస్తే.. ఉరిశిక్షే..!
తేరగా దొరికిందని రూ. 40 కోట్ల భూమిపై కన్నేశారు.. కట్ చేస్తే
Kohinoor: కోహినూర్ పుట్టింది ఎక్కడ ?? అది బ్రిటిషర్ల చేతికి ఎలా చిక్కింది ??
నా కూతరు మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతోంది! అసలు నిజం బయటపెట్టిన కల్పిక తండ్రి