శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది..?ఈ ఆయుర్వేద సీక్రెట్స్ తెలిస్తే షాకవ్వడం పక్కా..

శరీరంలో కొలెస్ట్రాల్ ఎలా పెరుగుతుంది..?ఈ ఆయుర్వేద సీక్రెట్స్ తెలిస్తే షాకవ్వడం పక్కా..


నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనకు తెలియకుండానే మనల్ని కబళిస్తున్న అతిపెద్ద సమస్య కొలెస్ట్రాల్. ఇది ఒక్కరోజులో వచ్చేది కాదు.. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల సంవత్సరాల తరబడి శరీరంలో నిశ్శబ్దంగా పేరుకుపోయే ఒక ప్రమాదకరమైన ప్రక్రియ. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల వచ్చే ఈ సమస్య చివరకు గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దారితీస్తోంది. మనం తీసుకునే అధిక నూనె పదార్థాలు, వేయించిన ఆహారాలు, క్రమం లేని జీవనశైలి వల్ల మన జీర్ణవ్యవస్థ బలహీనపడుతుంది. దీనివల్ల శరీరం నుండి బయటకు వెళ్లాల్సిన కొవ్వు, వ్యర్థ పదార్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. ఇవి క్రమంగా రక్త ధమనులలో ఒక మందపాటి పొరలా పేరుకుపోయి, రక్త ప్రసరణను అడ్డుకుంటాయి.

ఆయుర్వేద దృష్టికోణంలో అమా

ఆయుర్వేదం కొలెస్ట్రాల్‌ను కేవలం రక్తానికి సంబంధించిన వ్యాధిగా చూడదు. మన జీర్ణక్రియ సరిగ్గా లేనప్పుడు, ఆహారం పూర్తిగా అరగక శరీరంలో అమా అనే విషపూరిత పదార్థాలు తయారవుతాయి. ఈ వ్యర్థాలే ధమనులలో అడ్డంకులు సృష్టించి చెడు కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. అంటే మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటే కొలెస్ట్రాల్ సమస్య అదుపులో ఉన్నట్లేనని అయుర్వేదం చెబుతోంది.

ఆయుర్వేద అద్భుత పరిష్కారం

కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి కేవలం మందులపైనే ఆధారపడకుండా, ఆయుర్వేదం సూచించిన ఈ మూడు సహజ సిద్ధమైన పదార్థాలతో అద్భుత ఫలితాలను పొందవచ్చు..

  • వెల్లుల్లి: ఒక రెబ్బ
  • అల్లం: అర టీస్పూన్ తురిమినది
  • నిమ్మరసం: అర టీస్పూన్

ఎలా తీసుకోవాలి?

భోజనానికి సరిగ్గా 10 నిమిషాల ముందు ఈ మూడింటి మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇది మీ జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, ధమనులలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. క్రమంగా LDL లేదా చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *